Intercropping : కొబ్బరి, కోకోలో అంతర పంటగా వక్కసాగు
కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా ఇప్పుడు వక్కసాగును రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు.

Intercropping
Intercropping : అంతర పంటల సాగుకు కొబ్బరితోటలను రైతులపాలిట కల్పతరువుగా చెప్పుకోవచ్చు. కానీ చాలామంది రైతులు అంతర పంటలసాగు పట్ల అవగాహన లేకపోవటంతో ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పాక్షిక నీడనిచ్చే కొబ్బరి వాతావరణంలో ఎన్నో రకాల వాణిజ్య పంటలను సాగుచేసుకోవచ్చు. దీన్నే ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఏలూరుజిల్లాకు చెందిన ఓ రైతు. కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు నర్సరీని పెంచుతున్నారు.
READ ALSO : Intercropping : కొబ్బరిలో అంతర పంటగా వక్కసాగుతో అదనపు ఆదాయం
ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా ఉంటుంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో, ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో శాస్త్రవేత్తలు అంతరపంటగా కోకో సాగును ప్రోత్సహించటంతో పరిస్థితి మెరుగైంది.
READ ALSO : Terrac Garden : మిద్దెపై కూరగాయలు, పండ్లు పెంపకం
మరోవైపు కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా ఇప్పుడు వక్కసాగును రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.
READ ALSO : Intercropping in Coconut Plantation : కొబ్బరితోటలో అంతర పంటగా తోటకూర సాగు
ఇప్పటికే కొబ్బరి, కోకో పంటల్లో అంతర పంటగా 3 ఎకరాల్లో వక్కను సాగుచేశారు. రెండేళ్లుగా దిగుబడులను పొందుతున్నారు. మరో 20 ఎకరాల కొబ్బరి, కోకోలో అంతర పంటగా నాటేందుకు సిద్ధమవుతున్నారు.
READ ALSO : Vegetable Farming : కాక్ నూర్ కేరాఫ్ కూరగాయలు.. ఊరంతా కూరగాయల సాగు
ఈ వక్కపంటకు ఎలాంటి చీడపీడలు ఆశించవు, ప్రత్యేకంగా ఎరువులు కూడా వేయనవసరం లేదు . వక్క కాయలు పక్వానికి వచ్చిన సమయంలో నాలుగు నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు పెద్దగా పని ఉండదు . పెట్టుబడి ఉండకపోవడం.. అధిక లాభాలు ఉన్నందున వక్క తోటల సాగుకు ఎంతో ఆదరణ లభిస్తోంది. కొబ్బరి తోటలు ఉన్న రైతులు అంతర పంటగా సాగుచేస్తే.. అదనపు ఆదాయం పొందేందుకు వీలుంటుంది.