Intercropping : కొబ్బరిలో అంతర పంటగా వక్కసాగుతో అదనపు ఆదాయం

ద్వారకాతిరుమల మండలం, గుంగొలను గుంట గ్రామ రైతు అంజనేయ దుర్గాప్రసాద్ ,కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.

Intercropping : కొబ్బరిలో అంతర పంటగా వక్కసాగుతో అదనపు ఆదాయం

Betel Nut

Updated On : July 31, 2023 / 11:06 AM IST

Intercropping : అంతర పంటల సాగుకు  కొబ్బరితోటలను  రైతులపాలిట కల్పతరువుగా చెప్పుకోవచ్చు.  కానీ చాలామంది రైతులు అంతర పంటలసాగు పట్ల అవగాహన లేకపోవటంతో ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పాక్షిక నీడనిచ్చే కొబ్బరి వాతావరణంలో ఎన్నో రకాల వాణిజ్య పంటలను సాగుచేసుకోవచ్చు. దీన్నే ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఏలూరుజిల్లాకు చెందిన ఓ రైతు. కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు నర్సరీని పెంచుతున్నారు.

READ ALSO : Pink Bollworm : పత్తికి గులాబి రంగు పురుగు గండం.. ముందస్తు నివారణ చర్యలు

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా వుంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో  శాస్త్రవేత్తలు అంతరపంటగా కోకో సాగును ప్రోత్సహించటంతో పరిస్థితి మెరుగైంది.

READ ALSO : Coconut Cultivation : కొబ్బరి సాగులో.. ఎరువుల యాజమాన్యం

అయితే ఏలూరు జిల్లాలో, కోతుల బెడదతో పంటకు తీవ్రనష్టం జరుగుతోంది. దీన్ని గమనించిన ద్వారకాతిరుమల మండలం, గుంగొలను గుంట గ్రామ రైతు అంజనేయ దుర్గాప్రసాద్ ,కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.

READ ALSO : Abdominal pain: డెలివరీ తర్వాత పొత్తి కడుపులో తరచూ నొప్పి వస్తుందా? అయితే ఇలా చేయండి ..

ఇప్పటికే 4 ఎకరాల్లో అంతర పంటగా వక్కను నాటిన రైతు, మరో 16 ఎకరాల్లో నాటేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటే అరటిలో కూడా అంతర పంటగా సాగుచేస్తున్నారు. ఈ వక్కపంటకు ఎలాంటి చీడపీడలు ఆశించవు, ప్రత్యేకంగా ఎరువులు కూడా వేయనవసరం లేదు కనుక.. అదనపు ఆదాయం వస్తుందని చెబుతున్నారు.