Abdominal pain: డెలివరీ తర్వాత పొత్తి కడుపులో తరచూ నొప్పి వస్తుందా? అయితే ఇలా చేయండి ..
డెలివరీ తరువాత అండాశయం సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. అందుకే నొప్పి రావడం మామూలే. అయితే, నొప్పి ఏమాత్రం ఎక్కువ అనిపించినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

Abdominal pain
Abdominal pain after delivery: గర్భధారణ సమయంలో స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి. ఈ క్రమంలో కడుపు నొప్పి, కాళ్ల వాపు, వికారం, వాంతులు, మలబద్దకం, మధుమేహం వంటి చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది స్త్రీలలో కడుపులో అసౌకర్యం, పొత్తి కడుపులో నొప్పి ప్రసవం తరువాత కూడా కొనసాగుతుంది. సాధారణంగా డెలివరీ తరువాత ఆరో వారంలో కడుపు నొప్పి సమస్య ఎదురవుతుంది. దీనిని వైద్య భాషలో ఆఫ్టర్ పెయిన్స్ అంటారు. పీరియడ్స్ మళ్లీ మొదలయ్యే ఈ సమయంలో కొంత మంది మహిళలకు కూడా ఇది జరుగుతుంది. ప్రసవం తరువాత స్త్రీల ఉదర కణజాలాలు, అండాశయాలు సాధారణ స్థితికి వచ్చే ప్రక్రియలో ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మహిళలు పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు.

Abdominal pain after delivery
Loneliness : ఒంటరితనం నుంచి ఇలా బయటపడండి
అండాశయం సాధారణ స్థితికి రావడం వల్ల, మలబద్దకం వల్ల పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంది. డెలివరీ తరువాత ఇది మహిళల జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల ఆపరేషన్ తరువాత నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. మహిళల్లో డెలివరీ తరువాత కడుపునొప్పికి మత్తు మందు, నొప్పిని తగ్గించే మందులు కూడా కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. డెలివరీ తరువాత హార్మోన్ల మార్పులు, పైల్స్ సమస్యకూడా రావొచ్చు. మరోవైపు.. సిజేరియన్ తరువాత తరచుగా మహిళల పొత్తి కడుపులో నొప్పి సమస్య ఉంటుంది. దీనికి కారణం సిజేరియన్ ఆపరేషన్ తరువాత కుట్లు వేసిన చోట తేలికపాటి నొప్పి కూడా కనిపిస్తుంది. అదే సమయంలో కొంత మంది మహిళలు పొత్తి కడుపులో వాపుతోకూడా ఇబ్బంది పడతారు.

Abdominal pain after delivery
Brittle Nails : గోళ్లు విరుగుతున్నాయా… జాగ్రత్త
డెలివరీ తరువాత అండాశయం సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. అందుకే నొప్పి రావడం మామూలే. అయితే, నొప్పి ఏమాత్రం ఎక్కువ అనిపించినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. మామూలు నొప్పి అయితే గోరు వెచ్చని నీరు తాగాలి. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, గింజలు వంటివి తీసుకోవాలి. ప్రసవం తరువాత మహిళలు యోగా, వ్యాయామాన్ని తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలి. డెలివరి తరువాత పొత్తికడుపులో నొప్పితగ్గేందుకు వైద్యుల సలహా లేకుండా మందులు వాడొద్దు. ఏ సమస్య వచ్చినా మందులు వాడాలంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.