Cabbage and Cauliflower : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లి బెడద.. నివారిస్తే మంచి దిగుబడులు

వర్షాకాలంలో క్యాబేజి సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్నపని. ఎందుకంటే ఈ పంటల సాగుచేసే భూముల్లో నీరు నిల్వ వుండకూడదు. ఏ మాత్రం నీరు నిల్వ వున్న వేరుకుళ్లు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం వుంది.

Cabbage and Cauliflower : క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లి బెడద.. నివారిస్తే మంచి దిగుబడులు

Cabbage and Cauliflower

Cabbage and Cauliflower : క్యాబేజి, కాలీఫ్లవర్ సాగుకు రబీ  అత్యంత అనుకూలం. కానీ పంటంతా ఒకేసారి మార్కెట్ కు వస్తుండటంతో రేటు పలకక రైతులు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది రైతులు వర్షాకాలంలో ఈ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. దిగుబడి తక్కువ వచ్చినా మంచి రేటు వస్తుండటంతో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు ఈ పంటలను సాగుచేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నల్లి ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని వారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేస్తున్నారు  ఖమ్మం జిల్లా,  వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. రవి.

READ ALSO : Ladies Finger Planting : వేసవి పంటగా 2 ఎకరాల్లో బెండ సాగు.. 3 నెలలకే రూ. 2 లక్షల నికర ఆదాయం

వర్షాకాలంలో క్యాబేజి సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్నపని. ఎందుకంటే ఈ పంటల సాగుచేసే భూముల్లో నీరు నిల్వ వుండకూడదు. ఏ మాత్రం నీరు నిల్వ వున్న వేరుకుళ్లు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశం వుంది. అయితే ముందుగామార్కెట్ కు వచ్చిన పంటకు మంచి రేటు లభిస్తుండటంతో రైతులు రిస్కు వున్నా సాగుకు వెనకాడటం లేదు.

READ ALSO : International Tiger Day 2023: పులులను చూడాలని ఉందా? ఇక్కడికి వెళ్లాల్సిందే..

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని రైతులు అధికంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలను పండిస్తున్నారు.   ప్రస్తుతం 10 నుండి 15 రోజుల దశలో ఉంది . మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలకు నల్లిపురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు  ఖమ్మం జిల్లా,  వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. రవి.