Home » 10TV Agri
చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ.
మొదటి ఏడాది కొద్దిపాటి దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది 4 టన్నల వరకు వచ్చింది. ప్రస్తుతం 3వ పంట.. ఇప్పటికే 4 టన్నుల దిగుబడిని పొందిన ఈ రైతు మరో 2 నెలల వరకు దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.
ఆకుకూరల సాగుతో రైతులకు పెట్టుబడి భారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పూర్వికులనుండే ఆనవాయితిగా వచ్చిన ఆకుకూరలను చేపడుతూ.. రోజువారి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు.
వంగతోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువయ్యింది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తిచెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కన్పిస్తాయి.
ట్రాక్టర్ ఆపరేటెడ్ న్యూమాటిక్ ప్లాంటర్ పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సన్ ఫ్లవర్ ,సోయాబీన్ పంటలను విత్తుకొవచ్చు. విత్తనాన్ని ఖచ్చితంగా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రధాన ఫ్రేమ్, ఆస్పిరేటర్ బ్లోవర్, రంధ్రాలతో కూడిన డిస్క్, మీటరింగ్ ప్లేట్,
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. డెయిరీ ద్వారా వచ్చే ఎరువువల్ల వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు అనేకం.
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి.
కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.
మునగ మొక్క తోటను నరికిన తర్వాత, ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్శి లేదా మోడెం పంట అంటారు. జూన్ , జులై నెలల్లో మునగను నరికిన తర్వాత రైతులు కార్శి తోటల నిర్వహణపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.