Home » 10tv Top Headlines
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది.
నేటి నుంచి మూడు రోజులు తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరుగుతోందని ఈ పరిస్థితి మారాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. కారులో తరలిస్తున్న రూ.2కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఊహించలేము అన్నారాయన. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు.