Home » Amaravati farmers' padayatra
అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు పాదయాత్రలో సడలింపులను కోరుతూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ ను, అటు పాదయాత్రను రద్దు చేయాలని డీజీపీ వేసిన పిటిషన్ రెండింటిని కొట్టేసింది.
తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు.
అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పోలీసుల తీరుకి నిరసనగా నాలుగు రోజుల పాటు బ్రేక్ వేశారు రైతులు. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకుంటామని అమరావతి జేఏసీ నేతలు అంటున్నారు.
రాజమండ్రిలో రైతుల పాదయాత్రపైకి చెప్పులు వాటర్ బాటిళ్లు విసిరారు కొంతమంది వ్యక్తులు..నల్లబ్యాడ్జీలతో నినాదాలు చేస్తూ.. అమరావతి రైతులపైకి చెప్పులు వాటర్ బాటిళ్లు విసిరారు.
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
పోలీసులు రైతులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 400 పోలీసుల రక్షణ మధ్య రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రోడ్డంతా పోలీసులు రక్షణగా నిల్చుంటే.. పోలీసుల మధ్య నుంచి రైతులు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతు కొనసాగుతోంది. రైతు యాత్రకు సాయంగా తమ వంతుగా రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు.
బాపట్ల జిల్లా రేపల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు.. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది.
అమరావతి రైతుల సభకు.. అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రజాసంఘాలన్నింటిని ఆహ్వానించారు...రాయలసీమ మేధావుల ఫోరం 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం మరో సభ...