Kodali Nani : తమ ఆస్తులు మాత్రమే పెరగాలన్నది అమరావతి రైతుల ఆరాటం-కొడాలి నాని

తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని ఎద్దేవా చేశారు.

Kodali Nani : తమ ఆస్తులు మాత్రమే పెరగాలన్నది అమరావతి రైతుల ఆరాటం-కొడాలి నాని

Updated On : October 26, 2022 / 7:47 PM IST

Kodali Nani : ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడివాడ 15వ వార్డులో కొడాలి నాని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి అని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

”రాజధాని విషయంలో వాళ్లకే క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు ఒక మాయాలోకాన్ని సృష్టించారు. ఒక భ్రమరావతిని సృష్టించారు. గ్రాఫిక్స్ తో మాయ చేశారు. మేము మాత్రమే బాగుండాలని అమరావతి రైతులు ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్ సంక్పలించారు. అన్ని ప్రాంతాలు సమానం అని నమ్మారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటం. పార్టీలు, మీడియా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా జగన్ వెనక్కి తగ్గలేదు. జగన్ తపనంతా ప్రజల కోసమే. ఆరు నూరైనా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం. కర్నూలుకి హైకోర్టు తీసుకెళ్తాం. వైజాగ్ కి సెక్రటేరియట్ తీసుకెళ్తాం. ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది” అని కొడాలి నాని తేల్చి చెప్పారు.