Repalle Flexies : రేపల్లెలో రాజధాని రచ్చ.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు

బాపట్ల జిల్లా రేపల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు.. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది.

Repalle Flexies : రేపల్లెలో రాజధాని రచ్చ.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు

Updated On : September 16, 2022 / 11:09 PM IST

Repalle Flexies : బాపట్ల జిల్లా రేపల్లెలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు.. రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రేపుల్లెలో శనివారం పాదయాత్ర జరగనుంది. ఈ సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది.

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనడం స్వార్థం.. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు.. గ్రాఫిక్స్ పాలన వద్దు, సంక్షేమ పాలన ముద్దు.. ఇలాంటి నినాదాలతో పోస్టర్లు వెలిశాయి. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అనే నినాదంతో వెలిసిన ఫ్లెక్సీలు ఉద్రిక్తతలకు దారితీసే విధంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఫ్లెక్సీలు ఉన్నాయని మండిపడుతున్నారు. పాదయాత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించ లేదు. వీటిని చూసి మిగతా ప్రాంత వైసీపీ నేతలు కూడా ఇదే ఒరవడిని అనుసరించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అమరావతి రైతుల పాదయాత్రపై సీఎం జగన్ సహా మంత్రులు చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయి. ఈ సమయంలో వెలిసిన ఈ ఫ్లెక్సీలు.. ఆ హీట్ ను మరింత పెంచాయి. పాదయాత్ర కాదు దండయాత్ర అని మంత్రి అమర్నాథ్ అనగా, ఇతర ప్రాంత ప్రజలు మీ దగ్గర పనివాళ్లుగా పని చేయాలా? అని మంత్రి ధర్మానతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నించారు. అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పాదయాత్ర ఉందంటూ ముఖ్యమంత్రి జగన్ నిన్న అసెంబ్లీ వేదికగా కామెంట్స్ చేశారు. ఈ సమయంలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా రేపల్లెలో వెలిసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి.