ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని జగన్ ప్రారంభిస్తారు. సీఎ జగన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తాడేపల్లిగూడెంలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళ విషయంలో సీఎం జగన్ స్పందించారు. ఆమెకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట�
అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, అందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యం. అందుకే పవన్ కల్యాణ్ కి కూడా విజ్ఞప్తి చేస్తున్నా... అందరం కలుద్దాం.... కలిసి ప్రజాస్వామ్యం కోసం పోరాడదాం.
పోలీసులే శాంతి భద్రతల సమస్య సృష్టించి, విశాఖ నుంచి పవన్ ను ఉన్నపళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పవన్ ఈ రాష్ట్రం పౌరుడు కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. భేటీలో వారు ఏం మాట్లాడుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? పొత్తుల గురించి ప్రస్తావన వచ్చిందా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) విధించిన నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధులు నేడు అన్నదాతల ఖాతాల్లో జమకానున్నాయి. సోమవారం ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ వేదికద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో ని�
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన సమీక్షకు హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేదని సీఎం జగన్ తో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ శనివారం వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. తెల్లవారు జాము నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.