Andhra Pradesh: అవినాష్‌కోసం కర్నూల్‌కు సీబీఐ అధికారులు.. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన.. ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలు
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా మామ్మిడివరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

AP News
బీఆర్ఎస్ ప్లెక్సీలు చించివేత..
గుంటూరు జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశఆరు. అర్దరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్లెక్సీలు చించివేయడంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ప్రారంభించిన విషయం విధితమే.
తిరుమల సమాచారం..
తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారిని 84,539 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు సమకూరింది. సర్వదర్శనంకోసం నాలుగు కంపార్ట్మెంట్‌లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
Brijbhushan Sharan Singh: నేను నార్కో పరీక్షకు సిద్ధం.. రెజ్లర్లు సిద్ధమా? బ్రిజ్ భూషణ్ సంచలన ప్రకటన
పీఆర్ డీఈ నివాసంలో తనిఖీలు..
తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ శాఖ డీఈ రుద్రరాజు రవి ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుపై సోదాలు చేశారు. తిరుపతిలో ఐదు చోట్ల, చిత్తూరులో రెండు చోట్ల ఈ ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగాయి.
CBI Officials : కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో ఎంపీ అవినాశ్ రెడ్డి.. హాస్పిటల్ ముందు సీబీఐ అధికారులు
కర్నూల్‌కు సీబీఐ అధికారులు..
కర్నూలు జిల్లా విశ్వభారతి ఆస్పత్రి దగ్గర తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులను భారీగా మోహరించారు. పోలీసుల వలయంలో విస్వభారతి ఆస్పత్రి ఉంది. 1, 2, 3, 4 టౌన్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు ఆసుపత్రి చుట్టూ మోహరించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, హైదరాబాద్ కార్యాలయంకు విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వగా.. రెండు సార్లు పలు కారణాలతో రాలేనని సమాధానం ఇచ్చారు. సోమవారం సీబీఐ ఎదుట అవినాష్ హాజరు కావాల్సి ఉంది. అయితే, మా తల్లి ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో ఉండటంతో ఆమె డిశ్చార్జి అయ్యే వరకు నేను సీబీఐ విచారణకు రాలేనని లేఖ రాసినట్లు తెలిసింది. మూడోసారికూడా అవినాష్‌రెడ్డి విచారణకు రాలేనని చెప్పడంతో సీబీఐ అధికారుల బృందం అర్థరాత్రి కర్నూలు చేరుకుంది. రెండు సీబీఐ బృందాలు కర్నూల్ చేరుకున్నాయి. దీంతో ఏ క్షణమైనా అవినాష్ రెడ్డిని అదువులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
పేకాట రాయుళ్ల అరెస్టు..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వైయస్ఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 87,600 రూపాయల నగదు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి ..
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా మామ్మిడివరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. యానాం వైపునుండి అమలాపురం వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. ఒకరు సంఘటన స్థలంలో మృతి చెందగా, మరో ఇద్దరు అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను అమలాపురంకు చెందిన దొంగ స్వామి(31), జె.కృష్ణ(35), యనమదల రాజేష్ (34)గా పోలీసులు గుర్తించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి ఎ.అనిల్ గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు సీఎం జగన్ మచిలీపట్నం పర్యటన..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పర్యటించనున్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్‌లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి వెళ్తారు.