AP CM Jagan: అప్పుడు వైఎస్ఆర్, చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. ఈసారి పనులు పూర్తికావడం పక్కా అంటున్న వైసీపీ శ్రేణులు

బందరు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభానికి గతంలో ఇద్దరు సీఎంలు శంకుస్థాపన చేసినప్పటికీ.. ఆ పనులు ముందుకు సాగలేదు. తాజాగా సీఎం జగన్ పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.

AP CM Jagan: అప్పుడు వైఎస్ఆర్, చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. ఈసారి పనులు పూర్తికావడం పక్కా అంటున్న వైసీపీ శ్రేణులు

YSR and Chandrababu and Jagan

AP CM Jagan: కృష్ణా జిల్లాలో బందరు పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి సోమవారం భూమి పూజ చేయనున్నారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో ఈ పోర్టు నిర్మాణానికి పలుసార్లు శంకుస్థాపనలు చేసినా పనులు మాత్రం జరగలేదు. కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. తాజాగా సీఎం జగన్ సోమవారం మరోసారి పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.

AP CM Jagan: మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. సేవలు అందిస్తున్న వాలంటీర్లు.. వారికి గట్టిగా సమాధానం చెప్పండి..

బందరు పోర్టు నిర్మాణానికి రూ. 5,155,22 కోట్లు అవసరం అవుతాయని అంచనా. ఇందుకోసం 75శాతం బ్యాంకు రుణం, 25శాతం ప్రభుత్వం ఖర్చు చేయనుంది. బందరు పోర్టులో మొదటి విడతగా నాలుగు బెర్తుల నిర్మాణం జరగనుంది. ఈ బెర్త్ లలో ఒకటి కార్గో, రెండు కంటైనర్, ఒక కోల్ బెర్త్ నిర్మించనున్నారు. వీటి అనంతరం మిగిలిన 12 బెర్త్ ల నిర్మాణం జరగనుంది. ఇది పూర్తయితే 80వేల టన్నుల బరువైన షిప్పులుసైతం సురక్షితంగా పోర్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

బందరు పోర్టు నిర్మాణానికి 2008 ఏప్రిల్ 23న అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి చిన కరగ్రహారం పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం దగ్గర తొలిసారి శంకుస్థాపన చేశారు. అయితే, ఇందుకు సంబంధించి నిర్మాణ పనులు పూర్తికాలేదు. అదే పోర్టుకు 2019 ఫిబ్రవరి 7న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేకవాని పాలెం దగ్గర సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆతరువాతకూడా పలు కారణాలతో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇలా ఇద్దరు సీఎంలు రెండుసార్లు బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మూడోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి బందరు పోర్టు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈసారైనా పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని స్థానిక ప్రజలు ఆశతో ఉన్నారు.

Brijbhushan Sharan Singh: నేను నార్కో పరీక్షకు సిద్ధం.. రెజ్లర్లు సిద్ధమా? బ్రిజ్ భూషణ్ సంచలన ప్రకటన

బందరు పోర్టు నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరుతారు. మచిలీపట్నం మండల పరిధిలోని తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమిపూజ చేసి పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్ లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మచిలీపట్నం వెళ్లి అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి జగన్ తిరిగి చేరుకుంటారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.