AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

గతంలో మనుషులను వేటాడి చంపిన ఆ పులికి వయసు అయిపోయింది. ఇప్పుడు ఒక నాలుగు నక్కలను కలుపుకొని మళ్లీ కుట్రలు పన్నుతోంది అంటూ సీఎం జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

CM Jagan

AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం అనంతపురము జిల్లాలో పర్యటించిన సీఎం.. నార్పలలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంప్యూటర్ బటన్ నొక్కి జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. అనంతరం జగన్   ప్రసంగించారు. గత ప్రభుత్వంలో భోజన వసతి ఖర్చులు దేవుడెరుగు.. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి అనే జ్ఞానం కూడా లేదని విమర్శించారు. అరకొర ఫీజులు. ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు దులుపుకునే మనస్తత్వం వారిది. 1700 కోట్ల బకాయిలు పెట్టి పోయింది గత ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. మన ప్రభుత్వంలో మూడు నెలలకోసారి చెల్లింపులు చేస్తున్నాం. పేదలు పేదలుగా మిగలాలి అనేది గత ప్రభుత్వ మనస్తత్వం. మన ప్రభుత్వంలో డ్రాప్ అవుట్లు తగ్గాయి.

YS Viveka Case : వివేకా కేసులో ఎవరినీ ఎవరూ ఇబ్బంది పెట్టేది లేదు .. అరెస్ట్ కు సిద్ధంగా ఉండు : బీటెక్ రవి

గతంలో 18ఏళ్లు దాటిన పిల్లలు 35 శాతం మంది కూడా ఉన్నత చదువులు చదివేవారు కాదు. అది 80శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని జగన్ అన్నారు. ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ బడులతో పోటీపడే పరిస్థితి తీసుకొచ్చాం. ట్యాబ్ లు, బైజుస్ కంటెంట్ ఇస్తున్నాం. డిజిటల్ బోధనవైపు ప్రభుత్వ బడులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో మొట్టమొదటి సారి సబ్జెక్ట్ టీచర్స్ విధానం తీసుకొచ్చామని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల క్రితం 37 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 40 లక్షలు దాటిందని జగన్ చెప్పారు.

Tuni Constituency: టీడీపీ కొత్త ఎత్తులు.. జనసేనను నడిపించే నాయకుడు ఎవరు.. తునిలో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా?

చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ ..

నార్పల బహిరంగ సభలో చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓ ముసలాయన అంటూ.. ‘మోసపూరిత పులి’ కథ చెప్పారు. ఓ ముసలాయన రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది చూస్తే ఒక పంచతంత్ర కథ గుర్తొచ్చింది. గతంలో మనుషులను వేటాడి చంపిన ఆ పులికి వయసు అయిపోయింది. ఇప్పుడు ఒక నాలుగు నక్కలను కలుపుకొని మళ్లీ కుట్రలు పన్నుతోంది. మళ్లీ మనుషులను తినేందుకు బంగారు కడియాల ఆశ చూపుతోంది. ప్రజలు ఆ కుట్రలను నమ్మి మోసపోవద్దు. అబద్ధాలు ఆడే వారిని, మాయ మాటలు చెప్పేవారిని, వంచకులను ఎప్పుడూ నమ్మకూడదు.

YS Viveka Case : ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు.. నేరం రుజువైతే నాతో పాటు మరో 9మంది రాజీనామా : వైసీపీ ఎమ్మెల్యే

2014లో రైతులకు రుణమాఫీ కావాలంటే బాబు రావాలి అన్నాడు. బ్యాంకుల్లో బంగారం కావాలి అంటే బాబు రావాలి అన్నాడు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ఆయన యాడ్లు జనాలు నమ్మడం లేదని సంతకాలు పెట్టిన లేఖలు ఇంటింటికీ పంపించాడు. నమ్మి ఓట్లేసిన జనాలను నట్టేట ముంచాడు. కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుకు తోడుగా ఒక దొంగల ముఠా ఉంది. ఆ దొంగల ముఠాకు దత్తపుత్రుడు తోడయ్యాడు. గతంకి ఇప్పటికీ తేడా గమనించండి.. ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి డబ్బు వేస్తున్నాం. మీకు మంచి జరిగుంటే మాకు మద్దతు ఇవ్వండి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.