AP CM Jagan: మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. సేవలు అందిస్తున్న వాలంటీర్లు.. వారికి గట్టిగా సమాధానం చెప్పండి..

గత ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు వాలంటీర్లు వివరించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.

AP CM Jagan: మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. సేవలు అందిస్తున్న వాలంటీర్లు.. వారికి గట్టిగా సమాధానం చెప్పండి..

CM Jagan

Volunteer Vandanam: ప్రజా సంక్షేమానికి వారధులు వాలంటీర్లే అని చెప్పడానికి గర్వపడుతున్నానని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం జగన్ విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరుసగా మూడో ఏడాది ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వాలంటీర్లు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పి 64లక్షల మందికి పించన్లు అందిస్తున్నారని అన్నారు. 25 సంక్షేమ పథకాలను కులం, మతం, రాజకీయం చూడకుండా, లంచం లేకుండా లబ్ధిదారులకు అందించే సైన్యం వాలంటీర్లు అని జగన్ కొనియాడారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల అరాచకం చూశామని, కానీ, వైసీపీ ప్రభుత్వంలో తులసిమొక్క లాంటిది వాలంటీర్ వ్యవస్థ అని అన్నారు.

AP Volunteers: వాలంటీర్లకు వందనం.. వరుసగా మూడో ఏడాది అవార్డులు ప్రధానం.. ప్రారంభించనున్న సీఎం జగన్

ఆ బాధ్యత వాలంటీర్లదే .. 

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మన ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పే భాధ్యత వాలంటీర్ల భుజస్కంధాలపైనే ఉందని జగన్ అన్నారు. 25 పథకాలకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లుగా వాలంటీర్లు ఉన్నారని, 2 కోట్ల 10 లక్షల రూపాయలు డిబీటి ద్వారా 3కోట్ల రూపాయలు నాన్ డిబిటీ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. మంచి చేసిన చరిత్ర లేనివారు ఏం చెబుతున్నారో మీరు వింటున్నారు.. మనం చేస్తున్న మంచి చెప్పే సత్య సారధులు, సత్య సాయుధులు వాలంటీర్లే అని జగన్ అన్నారు.

AP BRS Office: ప్రారంభానికి సిద్ధమైన ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. ప్రారంభించేది ఎప్పుడో తెలుసా?

మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. 

వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోనిది కాదు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. సేవలు అందిస్తున్న వాలంటీర్లు. మీరు ఈ సేవ చేయకూడదు అని ఎవరైనా అంటే గట్టిగా సమాధానం చెప్పండి. మిమ్మల్ని లీడర్లుగా చేస్తాను అని మొదటి స్పీచ్‌లో చెప్పాను. ఇది గుర్తు పెట్టుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, దేశం మొత్తం ఎందుకు మీ వైపు చూస్తుందో వాలంటీర్లు ఆలోచించాలి అని జగన్ అన్నారు. వాలంటీర్లూ.. మీకు చేస్తున్న సన్మానం మీరు చేస్తున్న సేవలకు గుర్తింపు, 705 కోట్ల రూపాయలు మీ కోసం ఖర్చు చేశామని జగన్ అన్నారు.

Jagan Govt: సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. రూ.25 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశాలు

చంద్రబాబుకు కడుపులో మంట.. 

వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపులో మంట, చంద్రబాబుకు డజన్ జలసిల్ మాత్రలు వేసినా ఆ కడుపు మంట తగ్గదని జగన్ ఎద్దేవా చేశారు. తాను అధికారంలోనికి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తీసేసి జన్మభూమి వ్యవస్థను తెస్తామని చంద్రబాబు అన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికీ మంచి చేస్తున్న జగన్‌కు వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు.. జగన్ సైన్యం వాలంటీర్లు అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికీ ఉన్న తేడాను ప్రజలకు వాలంటీర్లు వివరించాలని జగన్ మోహన్ రెడ్డి  కోరారు.