Jagan Govt: సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. రూ.25 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశాలు

మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటీషన్ విచారించిన జస్టిస్ పుష్స సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్.. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది

Jagan Govt: సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. రూ.25 కోట్లు వెంటనే చెల్లించాలని ఆదేశాలు

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆవుల‌ప‌ల్లి, ముదివీడు, నేతిగుంట‌ప‌ల్లి ప్రాజెక్టుల నిర్మాణాల‌పై ఎన్జీటీ విధించిన స్టేని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. అంతే కాకుండా ఎన్జీటి విధించిన 100 కోట్ల రూపాయల జ‌రిమానాలో 25 కోట్ల‌ రూపాయలను వెంట‌నే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాల‌ని ఆదేశించిన జ‌స్జిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ సుంద‌రేశ్‭ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. 100 కోట్ల రూపాయల జ‌రిమానా విధించ‌వ‌చ్చా? అన్న అంశంపై సుప్రీం ధ‌ర్మాస‌నం పాక్చికంగా స్టే విధించింది.

Fawad Chaudhry : అరెస్ట్ భయంతో పోలీసులను చూసి కోర్టులోకి పరుగెత్తుతు పడిపోయిన మాజీ మంత్రి

చిత్తూరు జిల్లాలోని ఆవుల‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌రుకు ఎన్జీటీ ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తి రద్దు చేసింది. కాగా, ఎన్జీటి ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌న‌లు సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహత్గి వినిపించారు. ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు జ‌రిమానా విధించడం చ‌ట్టబ‌ద్దం కాదని ముకుల్ రోహత్గి అన్నారు. ఏపీ కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రమని, అటువంటి రాష్ట్రం మీద 100 కోట్ల రూపాయల జ‌రిమానా భారం అవుతుందని, జ‌రిమానా నిలుపుద‌ల చేయాల‌ని రోహత్గి కోరారు.

YS Viveka Case : అరెస్ట్ భయం .. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అవినాశ్ రెడ్డి .. అయినా దక్కని ఊరట

అయితే దీనిపై స్పందించిన సుప్రీం.. ప్ర‌స్తుతానికి 25 కోట్ల జ‌రిమానా కృష్ణా బోర్డులో జ‌మ చేయాల‌ని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రాజెక్టుల‌ను మీకు (ఏపీ ప్రభుత్వం) అనుకూలంగా విడ‌గొట్ట‌డం ఎలా చ‌ట్ట‌బ‌ద్ద‌మ‌ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏపీ ప్ర‌భుత్వ పిటీష‌న్ మీద ప్ర‌తివాదుల‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. అక్టోబ‌రులో త‌దుప‌రి విచార‌ణ‌ ఉంటుందని స్పష్టం చేసింది.

Siddaramaiah Political Journey: కన్నడ రాజకీయాల్లో మాస్‌లీడర్‌గా సిద్ధరామయ్య.. మచ్చలేని రాజకీయ జీవితం ఆయన సొంతం

మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటీషన్ విచారించిన జస్టిస్ పుష్స సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్.. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా దానికి పర్యావరణ అనుమతులనూ రద్దు చేసింది. మూడు రిజర్వాయర్లను ఒకే జీవో కింద చేపట్టి తాగునీటి కోసమని ఏపీ ప్రభుత్వం మొదట వాదించింది.

Bhatti Vikramarka: ఆర్నెళ్లు ఓపిక పట్టండి.. ఆ తరువాత వాళ్ల సంగతి చూద్దాం..

ఇందులో ఆవులపల్లి రిజర్వాయరుకి మాత్రమే ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. పర్యావరణ అనుమతుల దస్త్రాలలోనూ ప్యాబ్రికేట్ చేశారని ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్జీటి ఆదేశించింది.