AP BRS Office: ప్రారంభానికి సిద్ధమైన ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. ప్రారంభించేది ఎప్పుడో తెలుసా?

ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తొలుత విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు అనుకూలమైన భవనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవటంతో...

AP BRS Office: ప్రారంభానికి సిద్ధమైన ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. ప్రారంభించేది ఎప్పుడో తెలుసా?

AP BRS Party Office

Andhra Pradesh: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్రలో పార్టీ బలోపేతంకోసం ఇప్పటికే ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించగా.. ఈ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని స్థానిక ప్రజలపై హామీల వర్షం కురిపించారు. అయితే, మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి నిలిపేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు కోల్పోయిన వైనం

ఏపీలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. దీనికితోడు ఏపీలోని ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేలా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు ఆహ్వానం పలుకుతూ రాష్ట్రంలో ప్లెక్సీలు సైతం వెలిసిన విషయం విధితమే. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలంటే పార్టీ కార్యాలయం ఉండాలని భావించిన కేసీఆర్ ఆమేరకు దృష్టిసారించాలని ఏపీ నాయకత్వానికి సూచించారు. దీంతో గుంటూరు జిల్లాలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది.

BRS Delhi Office: ఢిల్లీలో బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. ఫొటో గ్యాల‌రీ

ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తొలుత విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు అనుకూలమైన భవనం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవటంతో గుంటూరులో పలు భవనాలను ఆ పార్టీ నాయకత్వం పరిశీలించింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా ఆటో‌నగర్ వద్ద ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనుక భాగంలో అయిదంతస్తులతో కూడిన నూతన భవనంలో కార్యాలయం కొలువుదీరనుంది. పార్టీ సమావేశాల నిర్వహణకు రెండు ఫ్లోర్లు కేటాయించారు. అతిథులు కూర్చొనే విధంగా పెద్దహాలు ఏర్పాటు చేశారు. ఇక, ఐదో అంతస్తులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఉంటుంది.

CM KCR : మహారాష్ట్ర బీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్‌ పొలిటికల్‌ పాఠాలు

ఈ నూతన కార్యాలయాన్ని ఈ నెల 21(ఆదివారం) ఉదయం 11.35 నిమిషాలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తోట ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.