CM KCR : మహారాష్ట్ర బీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్‌ పొలిటికల్‌ పాఠాలు

CM KCR : రెండు రోజుల పాటు మహారాష్ట్రలో శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. 288 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సమన్వయకర్తలకు ఆహ్వానం అందజేశారు.

CM KCR : మహారాష్ట్ర బీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్‌ పొలిటికల్‌ పాఠాలు

KCR

CM KCR Nanded Tour : తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాందేడ్ కు వెళ్లనున్నారు. ఈ నెల 19న నాందేడ్ కు వెళ్లనున్న కేసీఆర్.. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు పొలిటికల్ పాఠాలు చెప్పనున్నారు. ఆయన స్వయంగా ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో శిక్షణా తరగతులు కొనసాగనున్నాయి. 288 నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సమన్వయకర్తలకు ఆహ్వానం అందజేశారు.

ఈ నెల 19, 20 తేదీల్లో మహారాష్ట్రలో నేతలకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 19వ తేదీన సీఎం కేసీఆర్ స్వయంగా నాందేడ్ వెళ్లనున్నారు. శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు. శిక్షణా కార్యక్రమాలతో పాటు పార్టీని ప్రజల్లోకి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.(CM KCR)

Also Read..YS Sharmila: నాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు.. తెలంగాణలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరు.. 44 సీట్లలో గెలుస్తున్నాం..

ఈ సమావేశానికి మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇంచార్జ్ లతో పాటు సమన్వయకర్తలను ఆహ్వానించారు. దాదాపు వెయ్యి మంది నేతలకు రెండు రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించనున్నారు. ముందుగా తెలంగాణ భవన్ లోనే ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించాలని భావించారు. అయితే, మహారాష్ట్రకు చెందిన నేతలు కావడంతో అక్కడే నిర్వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో శిక్షణా శిబిరాల వేదికను మహారాష్ట్రంకు మార్చడం జరిగింది.

జూన్ మొదటి వారం నుంచి బీఆర్ఎస్ పార్టీ.. మహారాష్ట్రలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి ఇంకా ముహూర్తం ఖరారు కాకపోయినప్పటికీ.. సభ్యత్వ నమోదు సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై మాత్రం పూర్తిగా కసరత్తు పూర్తైందని చెప్పుకోవచ్చు. సభ్యత్వ నమోదును ఎలా చేపట్టాలి అన్న అంశంపై ఇప్పటికే నేతలకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. రోజుకు లక్ష సభ్యత్వాలు నమోదు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.

Also Read..Banjara Hills Youth Congress : బంజారాహిల్స్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై పోలీసుల దాడులు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో!

నియోజకవర్గానికి ఒక ప్రచార రథం, ఓ ట్యాబ్ ఏర్పాటు చేశారు. మరాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం రథాలు కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రతీ గ్రామానికి నేతలు వెళ్లి ఆన్ లైన్ లో సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఒక్కో సమన్వయకర్తకు ఒక ట్యాబ్ ను కూడా పార్టీ పంపిణీ చేయడం జరిగింది. ఈ ట్యాబ్స్ ద్వారా హైదరాబాద్, ఢిల్లీలోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి కూడా అనుసంధానం చేయడం జరిగింది. సభ్యత్వం తీసుకున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదయ్యే విధంగా పార్టీ ఏర్పాటు చేసింది. నియోజకవర్గానికి వెయ్యి క్రియాశీలక సభ్యత్వాలతో పాటు 40 నుంచి 50వేల మంది వరకు సాధారణ సభ్యత్వాలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.