YS Sharmila: నాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు.. తెలంగాణలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరు.. 44 సీట్లలో గెలుస్తున్నాం..

పేపర్ లీకుల్లో ఐటిశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఐటీ శాఖ సరిగ్గా పనిచేసి ఉంటే పేపర్ లీకులు అయ్యేవి కావని షర్మిల అన్నారు.

YS Sharmila: నాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు.. తెలంగాణలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరు.. 44 సీట్లలో గెలుస్తున్నాం..

YS Sharmila

YSR Telangana Party: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం లేదు. నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అనుకుంటే అసలు ఎందుకు పార్టీ పెట్టాలి? విలీనం చేయాలని అనుకుంటే రెండేళ్లుగా కిందపడి మీదపడి పార్టీని ఎందుకు నడపాలి అని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2014లో 21 గెలిచింది. 2018లో 19సీట్లు గెలిచింది. పెద్దచరిత్ర ఉన్న పార్టీ గెలిచిన సీట్లను ఎంతమందిని నిలుపుకుందో మనందరికీ తెలుసు.. కేవలం ఐదు మంది మాత్రమే ఆ పార్టీలో ఉన్నారని షర్మిల ఎద్దేవా చేశారు.

 

కాంగ్రెస్ పార్టీలో లీడర్ షిప్ కొరత ఉంది. అందుకే ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోతోందని ఆమె అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వైభవం ఉంది. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీలా ఉండేది. వైఎస్సార్ లేని కాంగ్రెస్ ఇప్పుడు జీరో. క్యాడర్, లీడర్ ను నిలుపుకుంటే కాంగ్రెస్ పై నమ్మకం ఉండేది. ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని షర్మిల అన్నారు. ఇప్పుడు భయట నుంచి లీడర్లను తెచ్చుకొనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు లీడర్లను నిలుపుకొనే సత్తా ఉందా లేదా అనేది ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి? విలీనం చేయాలని అలోచన ఉంటే 3800కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేయాలని షర్మిల అన్నారు.

 

విలీనం చేయాలని అనుకుంటే పార్టీ పెట్టకముందే నాకు ఎన్నో ఆఫర్లు ఉన్నాయని, అవన్నీ కాదని వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టింది విలీనం చేయడానికి కాదని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒక ఫోర్స్ లా తయారయ్యింది. తెలంగాణాలో షర్మిల అంటే తెలియని వాళ్లు లేరు. డిల్లికి చెందిన ఒక సర్వే సంస్థ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ 44సీట్లలో ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇది నేను చేసిన సర్వే కాదు. నాకు సంబందం లేదు. 44సీట్లలో నా ప్రభావం ఉంటే.. ఐదు సీట్లకో, 10సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం నాకు లేదని షర్మిల అన్నారు.

 

కర్నాటక ఫలితాలు ఒక చెంపపెట్టు. మతరాజకీయాలకు, కుల్లు రాజకీయాలకు కర్ణాటక ఫలితాలు చెంపపెట్టు. అక్కడ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ పార్టీని బొందపెట్టడం ఖాయమని షర్మిల అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులు తెలంగాణ రాష్ట్రానికి సిగ్గు చేటని, లక్షలమంది బిడ్డల ఆశలు అడియాశలయ్యాయని అన్నారు. అయినా, ఇది చిన్న విషయం అని కేసీఆర్ అంటున్నాడు. సిట్ దర్యాప్తు వేసి సైలెంట్ గా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ షర్మిల ఆరోపించారు.

 

పేపర్ లీకుల్లో ఐటిశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఐటీ శాఖ సరిగ్గా పనిచేసి ఉంటే పేపర్ లీకులు అయ్యేవి కావు. దర్యాప్తు సరిగ్గా చేస్తే కేటీఆర్ భయటపడతాడు అని భయం. అన్నిశాఖల్లో ప్రతి కంప్యూటర్‌కు ఐటీ శాఖనే భాద్యత. అన్ని కంప్యూటర్ల భద్రత ఐటి శాఖ పరిదిలోనే ఉంటుంది. పేపర్ లీకులు అయ్యే సరికి కేటీఆర్ నాకేం సంబందం లేదంటున్నారు. ఇప్పుడు పేపర్ లీకుల వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయని బుకాయిస్తున్నాడు. ఏ ప్రతిపక్ష పార్టీ పేపర్ లీక్ చేసిందో చెప్పండి. మీ దగ్గర ప్రతిపక్షాలు పేపర్ లీకులు చేసినట్లు ఆదారాలు భయటపెట్టండి. ఏదిపడితే అది మాట్లాడితే సరిపోదంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క ఉద్యోగం భర్తి చేయలేదు. ఈ అఫిడవిట్ లో బిశ్వాల్ కమీషన్ ప్రకారం 1.91లక్షల ఉద్యోగాలను భర్తి చేస్తామని రాశాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే వెంటనే ఈ అఫిడవిట్ లో సంతకం పెట్టాలని షర్మిల అన్నారు.