Banjara Hills Youth Congress : బంజారాహిల్స్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై పోలీసుల దాడులు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో!

కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లతోపాటు కొన్ని ఫైల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ కార్యాలయం నడుస్తోంది.

Banjara Hills Youth Congress : బంజారాహిల్స్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై పోలీసుల దాడులు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో!

Cyberabad police raids

Cyberabad Police Raids : హైదరాబాద్ బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అయితే కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో సోమవారం బంజారాహిల్స్ లోని యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచార చేస్తున్నారని మే5న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ లోని యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై పోలీసులు దాడులు చేసినట్లు కనిపిస్తోంది.

కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లతోపాటు కొన్ని ఫైల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. విలువైన డేటాతోపాటు కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ కార్యాలయం నడుస్తోంది. ప్రశాంత్ ని మంగళవారం విచారణకు హాజరు కావాల్సిందిగా సైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

PFI : యూపీ, బీహార్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు

మరోవైపు బంజారాహిల్స్ లో యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై సైబరాబాద్ పోలీసుల దాడులను యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డి ఖండించారు. సైబరాబాద్ పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. కర్ణాటక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర అమోఘమని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ ప్రశంసించిన నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.

తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ను కట్టడి చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ దొంగ నాటకాలు యూత్ కాంగ్రెస్ ను అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు దాడులు చేయడంపై మండిపడ్డారు. లాప్ టాప్ లు ఎత్తుకెళ్లడం దుర్మార్గం, చట్ట విరుద్ధమన్నారు. కేసీఆర్ ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని తెలిపారు.