BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు కోల్పోయిన వైనం

రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కింది. అయితే, విభజన అనంతరం ఆ పార్టీ తెలంగాణలో మాత్రమే పోటీ చేసింది.

BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు కోల్పోయిన వైనం

BRS

BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపు (Status of state party)ను కోల్పోయింది. ఇక తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీగా గుర్తింపు కొనసాగుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తమ నిర్ణయాలను ప్రకటించింది.

రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు దక్కింది. అయితే, విభజన అనంతరం ఆ పార్టీ తెలంగాణలో మాత్రమే పోటీ చేసింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు.

పార్టీకి సంబంధించి పలుసార్లు సమాచారం ఇవ్వాలని కోరినా సమావేశాలకు బీఆర్ఎస్ హాజరుకాలేదు. అదే అంశాన్ని ఉత్తర్వుల్లో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల గుర్తులు( రిజర్వేషన్, కేటాయింపులు) 1968 ఆర్డర్ ప్రకారం నిర్ణయం తీసుకుంది.

3 శాతం ఓట్లు లేదా 3 అసెంబ్లీ సీట్లు

ఏదైనా ఓ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో పార్టీ 3 శాతం ఓట్లు పొందాల్సి ఉంటుంది. లేదంటే 3 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. అటువంటి పార్టీకి రాష్ట్ర హోదా దక్కుతుంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. దీంతో ఆ పార్టీ అక్కడ రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయింది.

ఇక దేశంలోని పలు పార్టీలు కూడా కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయాయి. మణిపూర్ లోని పీడీఏ, పుదుచ్చేరిలోని పీఎంకే, ఉత్తరప్రదేశ్ లోని ఆర్ఎల్డీ, పశ్చిమ బెంగాల్లోని ఆర్ఎస్పీ, మిజొరంలోని ఎంపీసీ కూడా రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయాయి.

కొత్తగా రామ్ విలాస్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, మేఘాలయాలోని వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ, త్రిపురలోని త్రిపా మోథాకు రాష్ట్ర పార్టీలుగా హోదా ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

National Party Status: సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీకి షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు.. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీ