National Party Status: సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీకి షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు.. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీ

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది.

National Party Status: సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీకి షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు.. ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీ

National Party Status

National Party Status: సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీకి జాతీయ పార్టీ హోదా రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ 2012లో పుట్టుకొచ్చింది.

అన్నాహజారె చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న కేజ్రీవాల్ అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. గుజరాత్ లోనూ 5 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కింది.

ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) శరద్ పవార్ కు చెందింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన పార్టీ. ఆ రెండు పార్టీలతో పాటు ఇప్పుడు సీపీఐ (CPI) కూడా ప్రాంతీయ పార్టీ హోదాలోనే ఉంటుంది.

కామన్ సింబల్ పొందలేరు

ఏదైనా పార్టీ జాతీయ పార్టీ హోదాను కోల్పోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏయే రాష్ట్రాల్లో ఓ పార్టీకి గుర్తింపు ఉండదో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కామన్ సింబల్ ను అభ్యర్థులు దక్కించుకోలేరు. ఏదైనా ఓ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కాలంటే దేశంలో సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6 శాతం పొందాల్సి ఉంటుంది. లేదంటే దేశంలోని ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్ సభ స్థానాల్లో గెలవాల్సిన ఉంటుంది.

Maharashtra: మహారాష్ట్రలో ఎక్సాన్ మొబిల్ రూ.900 కోట్ల పెట్టుబడులు.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‭తో ఒప్పందం