YSR Law Nestham: వైఎస్ఆర్ లా నేస్తం ఆర్థిక సాయం.. వారి అకౌంట్లలో జమకానున్న రూ. 25వేలు

వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5,000 స్టైఫండ్‌ను ఏపీ ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత నగదును సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

YSR Law Nestham: వైఎస్ఆర్ లా నేస్తం ఆర్థిక సాయం.. వారి అకౌంట్లలో జమకానున్న రూ. 25వేలు

AP CM Jagan

Updated On : June 26, 2023 / 7:15 AM IST

AP CM Jagan: కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఈ క్రమంలో లా వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడు ఏళ్లపాటు ఏడాదికి 60వేలు చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ మూడేళ్లకు మొత్తం రూ. 1,80,000 స్టైఫండ్ ను వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్రమంలో 2023-24 సంవత్సరానికి మొదటి విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులను సోమవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు.

YSR Law Nestham Scheme: బటన్ నొక్కి ‘వైఎస్ఆర్ లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్ ..

వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ. 5,000 స్టైఫండ్ చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్రమంలో 2023 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలలకు సంబంధించిన రూ. 25వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం రూ. 6,12,65,000 సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 41.52 కోట్లుకు చేరుతుంది.

Vangaveeti Radhakrishna : ఎన్నిసార్లు గెలిచామన్నది కాదు.. ప్రజల కోసం ఏం చేశాన్నమదే లెక్క- వంగవీటి రాధా

న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ. 100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్” ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. న్యాయవాదులు అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ.25కోట్ల ఆర్థిక సాయంను ఏపీ ప్రభుత్వం అందించింది. ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్‌లైన్‌లో sec_law@ap.gov.in ద్వారా లేదా నేరుగా లా సెక్రటరీకి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే “వైఎస్సార్ లా నేస్తం” పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా 1902ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.