Gold Price Today : దెబ్బ పడింది.. సంక్రాంతికి పట్టుకోలేం..! బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. వచ్చే నెలలో హడలే..!

Gold Price Today : నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగకు బంగారం, వెండి కొనుగోలు చేయాలకునే సామాన్య ప్రజలకు బిగ్ షాక్.

Gold Price Today : దెబ్బ పడింది.. సంక్రాంతికి పట్టుకోలేం..! బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. వచ్చే నెలలో హడలే..!

Gold Price Today

Updated On : December 15, 2025 / 10:43 AM IST

Gold Price Today : నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగకు బంగారం, వెండి కొనుగోలు చేయాలకునే సామాన్య ప్రజలకు బిగ్ షాక్. ప్రస్తుతం వీటి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. అయితే, వచ్చే నెలలో గోల్డ్, సిల్వర్ రేటు భారీగా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read : Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్.. అలా చేయకుంటే రేషన్ కట్..! హెచ్చరికలు జారీ..

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువ కావడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నష్టాలను నివారించుకోవడానికి బంగారం వారికి సేఫ్ హెవెన్ గా కనిపిస్తోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధరల పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను ఇప్పట్లో విరమించుకునేలా కనపడటం లేదు. దీంతో వచ్చే ఏడాది జనవరిలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. న్యూఇయర్, సంక్రాంతికి బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకునే సామాన్య ప్రజలకు బిగ్ షాక్ తప్పదనే చెప్పొచ్చు.

సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.820 పెరగ్గా.. 22క్యారట్ల బంగారంపై రూ.750 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ ఏకంగా 32 డాలర్లు పెరిగింది.. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,325 డాలర్ల వద్దకు చేరింది. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.3వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,23,500 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,34,730కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,23,650 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,34,880కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,23,500 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,34,730కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,13,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,09,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,13,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.