Home » Bus Accident
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొట్టిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన పెషావర్‌లోని గిల్గిత్ - బాల్టిస్తాన్ ప్రాంతంలోని దియామిర్ పరిధి షాతియల్ చౌక్ వద్ద చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. దీంతో స్కూల్ బస్సులోని 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డి పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు చిన్నారుల�
కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు బోల్తా పడి 20 మంది మృతి చెందారు. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
మధ్యప్రదేశ్ లోని రాహత్ గఢ్‌లో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. సాగర్ కలెక్టర్ దీపక్ ఆర్య మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... ఇవాళ ఉదయం 40 మంది విద్యార్థులు వారి
చైనాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 27 మంది అక్కడికక్కడే మరణించారు. 20 మంది �
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఓ బస్సు పెట్రోల్ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడ్డాయి. ఆ మంటల్లో బస్సులో ఉన్న 20 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అమర్నాథ్ యాత్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అమర్ నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్ వద్ద బద్రగుండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 మంది యాత్రికులు గాయపడ్డారు.
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి ప్రయాణికులు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇవాళ ఉదయం 8.30 గంటలకు ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కుల్లూ జిల్లాలోని నియోలీ-షంషెడ్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అక్కడి జంగ్లా ప్రాంతంలోని సయింజ్ లోయలో అదుపుతప్పి పడిపోయింది.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.