Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Pakistan Bus Accident
Pakistan Bus Accident : పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
అతివేగం, భారీ వర్షమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. బస్సు క్వెట్టా సమీపానికి రాగానే ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
బస్సు ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలూచిస్థాన్ సీఎం మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw