Home » Chilli Cultivation
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.
విత్తన శుద్ధి చేయని రైతులు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రానిల్ గుళికలు వేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చేపురుగులను నారుమడిలో రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎత్తైన నారుమళ్ళలో 8-10 సెం.మీ. దూరంలో నారుమడికి అడ్డంగా చేతితో గీతలు గీయాలి.
మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్ కు సంబంధించిన శిలీంధ్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కుల చేసేటప్పుడు ట్రైకోడర్మావిరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది.
తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలలోనే దాదాపు 22 వేల హెక్టాలర్లలో సాగుచేస్తున్నారు రైతులు ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.
ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరపసాగవుతుంది.
మిరపాకాయ తొలుచు పురగుల నివారణ కోసం వే గింజల కషాయం వాడాలి. గుడ్ల సమూమాలను , లార్వా స్ధావరాలను , పెరిగే పిల్ల పురుగులను సేకరించి ధ్వంసం చేయాలి.