Chilli Nursery : నాణ్యమైన మిరప నారు ఉత్పత్తిలో సూచనలు

విత్తన శుద్ధి చేయని రైతులు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రానిల్‌ గుళికలు వేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చేపురుగులను నారుమడిలో రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎత్తైన నారుమళ్ళలో 8-10 సెం.మీ. దూరంలో నారుమడికి అడ్డంగా చేతితో గీతలు గీయాలి.

Chilli Nursery : నాణ్యమైన మిరప నారు ఉత్పత్తిలో సూచనలు

chilli fiber

Chilli Nursery : మిరప పంట దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. చాలా వరకు రైతులు హైబ్రీడ్‌ మిరప విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. నారుమడిని పెంచే ముందు మనం సాగు చేసే విస్తీర్జానికి అనుగుణంగా నారుమడిని తయారు చేసుకోవాలి.

READ ALSO : Detect Adulteration : కూరగాయలు, పండ్లలో కల్తీని గుర్తించటం ఎలాగో తెలుసా ?

మిరప పంట సాగులో అతి ముఖ్యమైనది విత్తన ఎంపిక. రైతులు మిరపను పచ్చిమిరపకు సాగు చేయాలా లేదా ఎండు మిరపకు సాగు చేయాలా నిర్ణయించుకొన్న తరువాత రకాన్ని ఎంపిక చేసుకోవాలి. విత్తనం ద్వారా వ్యాప్తి చెందే చీడపీడలను నివారించడానికి తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. సంకర రకాలను సాగు చేసేటవుడు కంపెనీ వారే శిలీంధ్ర నాశినితో శుద్ధిచేసి ఉంచుతున్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు గాను 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ మందును ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

రైతులు నారుమడి స్థలాన్ని ఎన్నుకొనేటపుడు ఎప్పుడూ వేసే స్థలాన్ని గాక మార్చి కొత్త ప్రాంతాన్ని ఎన్నుకోవాలి. దీనివల్ల భూమినుంచి వ్యాపించే శిలీంధ్రాల బెడద తక్కువగా ఉంటుంది. నారుమళ్ళను ఎటువంటి పరిస్థితుల్లోను నీడలోగాని ఇతరత్రా చెట్ల నీడలోగాని పెంచకూడదు. నారుమడికి ఎంపిక చేసిన భూమిని బాగా దుక్కిదున్ని ఎత్తైన నారుమళ్ళను తయారు చేసుకోవాలి. ఒక ఎకరా నేల సాగు చేసేందుకు కావలసిన నారు మొక్కలు పెంచడానికి 10 మీ. పొడవు 1 మీ. వెడల్పుగల నాలుగు మడులు అవసరమవుతాయి. మడికి మడికి మధ్య నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. నారుమడిలో రసాయనిక ఎరువులు వేయకుండా తగినంత వానపాముల ఎరువును వేవపిండిని వేనుకొని కలియ దున్నుకోవాలి.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

విత్తన శుద్ధి చేయని రైతులు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రానిల్‌ గుళికలు వేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చేపురుగులను నారుమడిలో రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎత్తైన నారుమళ్ళలో 8-10 సెం.మీ. దూరంలో నారుమడికి అడ్డంగా చేతితో గీతలు గీయాలి. అందులో ఒక్కొక్క విత్తనాన్ని వలుచగా విత్తురోవాలి. దీనివల్ల అన్ని మొక్కలు దృఢంగా సమానంగా పెరుగుతాయి. నాటిన తరువాత నారుమడిలో విత్తనం కనబడకుండా వానపాముల ఎరువుతో కప్పాలి. హైబ్రీడ్‌ విత్తనం 100 గ్రా. ఒక ఎకరానికి సరిపోతుంది.

విత్తిన వెంటనే నారుమడిని వరి చెత్తతో కప్పాలి. దీనివల్ల తేమ సంరక్షింపబడి మొలకశాతం పెరుగుతుంది. కలుపును కూడా అరికట్టవచ్చు. విత్తిన వెంటనే మరియు వారం రోజుల వరకు రోజుకు రెండుసార్లు నీటిని చిలకరించాలి. వారం తరువాత రోజుకు ఒక తడినిస్తే సరిపోతుంది. విత్తిన 15 రోజుల తర్వాత కలుపు మొక్కలను ఏరివేయాలి. నారుమళ్ళలో సాధారణంగా ఆశించే మాగుడు తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా నోవా వారి సంజీవని 3 గ్రా. / లీటరు నీటికి కలిపి 13వ రోజు , 20వ రోజు నారుమడిని తడపాలి.

READ ALSO : Harvesting Chillies : మిర్చి కోతల సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు !

నారుమళ్ళలో గుళికలు వేసిన 25-30 రోజుల తర్వాత ఒకసారి ఒక పురుగు మందును, ఒక శిలీంధ్రనాశిని మందును కలిపి చల్లుకుంటే మంచిది. 5 లేదా 6 వారాల వయసు ఉన్న నారు ప్రధాన పాలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. నారుమడిలో పైపాటుగా రసాయనిక ఎరువులు వేయవద్దు. మిరపను సాగు చేసే రైతులు పైన సూచించిన చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఆరోగ్యమైన నారు పొంది ప్రధాన పొలంలో ఖర్చుతగ్గి మంచి దిగుబడులు పొందడానికి దోహదపడుతుంది.