Mirchi Crop : అంతరించిపోతున్న చీమమిర్చిని సాగుచేస్తున్న గిరిజన రైతులు
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు.

Mirchi Crop
Mirchi Crop : చీమ మిర్చి.. అన్ని మిరపకాయల్లా ఇది కాసి కిందకు వేలాడదు.. నిటారుగా పైకి కాస్తుంది. ఇది పేరుకే పొట్టి మిర్చి.. కానీ ఘాటు మాత్రం ఎక్కువే. ఒక్కసారి నోటికి తగిలిందనుకో.. చెప్పలేనంత మంట పుడుతుంది. అందుకే మార్కెట్ లో దినికి డిమాండ్ ఎక్కువ. ఇది దేశీ రకం. సహజంగా అడవుల్లో కాసే ఈ మిరపను అభివృద్ధి చేసి.. గిరిజన రైతులచేత సాగుచేయిస్తూ.. బైబ్యాక్ ఒప్పందంపై కొనుగోలు చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సుస్త్రీయ సేంద్రియ వ్యవసాయ సంఘం .
READ ALSO : Cultivation of Dates : కరువు సీమలో ఖర్జూర సాగు.. నాటిన 4 ఏళ్లనుండి 80 ఏళ్ల వరకు పంట దిగుబడులు
చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకి పుంఖాను పుంఖాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లి అని కూడా అంటారు. అడవుల్లో సహజంగా పెరిగే ఈ మొక్కల నుండి గిరిజనులు కాయలు కోసుకొని తమ వంటల్లో వాడుతుంటారు. అంతరించి పోతున్న ఈ రకాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలంలోని సుస్త్రీయ సేంద్రియ వ్యవసాయ సంఘం అభివృద్ధి చేస్తోంది.
READ ALSO : Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ కచ్చితంగా కక్ష సాధింపే : పవన్ కల్యాణ్
వీటితో పాటు అస్సాంలో సాగుచేసే ఇదే రకం విత్తనాలను కూడా సేకరించి వాటిని పశ్చిమగోదావరి జిల్లా, వెంకటరామన్న గూడెం ఉద్యాన విశ్వవిద్యాలంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నారు పెంచించి … గిరిజన రైతుల చేత గత రెండేళ్లుగా సాగుచేయిస్తున్నారు. ఈ మొక్కను ఒక్కసారి నాటితే 4 ఏళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు.
READ ALSO : Chilli Nursery : నాణ్యమైన మిరప నారు ఉత్పత్తిలో సూచనలు
ఏడాదికి మూడు కోతల చొప్పున ఒక్కో మొక్కనుండి 12 కిలోల దిగుబడిని పొందవచ్చు. రైతుకు కిలోకు 350 రూపాయలు చెల్లిస్తున్న ఈ సంఘం ప్రైవేట్ కంపెనీలకు 650 రూపాయలకు అమ్ముతోంది. ఈ మిరపను అధికంగా పెప్పర్ స్ప్రే గా, అప్పడాల్లో అధికంగా వాడుతుంటారు. ఈ కారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడమే కాకుండా గుండెజబ్బులు రాకుండా చేస్తోంది. అస్తమా ఉన్న వారు ఈ కారం వాడితే తగ్గుతుంది.