Cultivation of Dates : కరువు సీమలో ఖర్జూర సాగు.. నాటిన 4 ఏళ్లనుండి 80 ఏళ్ల వరకు పంట దిగుబడులు

నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజులు ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి.. మంచి పూత, పిందె పడుతుంది.

Cultivation of Dates : కరువు సీమలో ఖర్జూర సాగు.. నాటిన 4 ఏళ్లనుండి 80 ఏళ్ల వరకు పంట దిగుబడులు

Cultivation of Dates

Cultivation of Dates : ఎడారిలో పెరిగే వృక్షం ఖర్జూరం. పోషక విలువలతో కూడిన తియ్యదనం దాని సొంతం. ఈత చెట్టుని పోలి ఉండే ఈ ఖర్జూరం… తెలుగు రాష్ట్రాల్లో కాయడం కష్టం. సాగు చేయడం అంటే సాహసమే. అలాంటి ఖర్జూరం.. కరువు సీమగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఖర్జూరపు సిరులు కురుస్తున్నాయి. 3 ఏళ్లక్రితం నాటిన ఓరైతు ప్రస్తుతం దిగుబడులను పొందుతున్నారు . స్థానికంగానే అమ్ముతూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Drumstick Fodder : పశుగ్రాసంగా మునగ.. సాగు చేపట్టే విధానం

తరాలు మారుతున్నాయి . అవసరాలు పెరుగుతున్నాయి . అన్ని రంగాల్లోలాగే  వ్యవసాయంలో కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి . శ్రమ, పెట్టుబడికి తగ్గ ఫలసాయం వస్తే చాలనే విధంగా నేటి రైతు ఆలోచనా ధోరణి వుంది. అయితే మార్కెట్ ను క్షూణ్ణంగా పరిశీలించిన వారు, కొత్త పంటల్లో ఉన్న అవకాశాలను వెతికి పట్టుకుని అద్భుత విజయాలను నమోదుచేస్తున్నారు . తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఈ 7 ఎకరాల ఖర్జూర తోట. వర్షపాతం తక్కువ వుండే అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం, మర్తాడు గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి 3 ఏళ్ల క్రితం సాగుచేసి నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

రైతు రమణారెడ్డి చేసేది పట్టుచీరల వ్యాపారం. కానీ చిన్నప్పటి నుండి వ్యవసాయంపై మక్కువ. ఆ మక్కువతోనే 7 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలుచేశారు. అయితే తోటి రైతులకు భిన్నంగా పంటలను సాగుచేయాలనుకున్నారు. ఖర్జూర గురించి తెలుసుకొని 4 ఏళ్ల క్రితం ఒక్కో మొక్కకు 4,500 చొప్పున చెల్లించి ఆబుదాబి నుండి 500 మొక్కలు దిగుమతి చేసుకొని నాటారు. ఖర్జూరపు తోటలు సాగు చేయాలంటే తొలి సంవత్సరం పెట్టుబడులు ఖర్చులు ఎక్కువగా భరించాల్సి ఉంటుంది. నాణ్యమైన మొక్కలు కొనుగోలు చేయటం, నాటడం, డ్రిప్, భూమి చదును, ఎరువులు, కూలీల ఖర్చుల రీత్యా మొదటి సంవత్సరం బాగానే ఖర్చవుతుంది. రెండు, మూడో సంవత్సరం కొంత పెట్టుబడి తగ్గుతుంది నాలుగో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది . అయితే 5 ఏడాది నుండి అధిక దిగుబడి వస్తుంది. ఇలా ఒకసారి నాటుకుంటే 50 నుండి 80 ఏళ్ల వరకు పంట తీసుకోవచ్చు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

మూడేళ్లు జాగ్రత్తగా పెంచితే నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజులు ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి.. మంచి పూత, పిందె పడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తోటలో ఎకరాకు కనీసం 10 నుంచి 12 మగ ఖర్జూర చెట్లు నాటుకోవాలి. మగ చెట్లు కేవలం పూత పూస్తాయి. వాటికి పూసిన పూల రెమ్మల పుప్పొడితో.. ఆడ చెట్ల పూతతో పరపరాగ సంపర్కం చేయించాలి. ప్రతి గెలకు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సి వుంటుంది. ఇలా ఈ రైతు కూడా మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ.. నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతున్నారు.

READ ALSO : Bengalgram Cultivation : శనగ పంట సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్దతులు

నీటి ఎద్దడి అధికంగా వున్న ప్రాంతాలు, సమస్యాత్మక భూముల్లో సైతం సులభంగా పెరగగల మొండి జాతి మొక్క ఖర్జూర. పండుగా తయారుచేసి విక్రయించే అవకాశం లేకపోయినా తాజా ఫ్రూట్ కు మంచి మార్కెట్ వుండటంతో రైతుకు కలిసి వస్తోంది. ఈ పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ. ప్రారంభపు పెట్టుబడి అధికంగా వున్నా… ఐదేళ్లలో తిరిగి రాబట్టుకునే అవకాశం వుంది. తరువాత 50 సంవత్సరాలకు పైగా నికర ఆదాయం అందించే పంటగా ఖర్జూరం పేర్కొనవచ్చు.