Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ కచ్చితంగా కక్ష సాధింపే : పవన్ కల్యాణ్
చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

Pawan Kalyan On Chandrababu Arrest
Chandrababu arrest..Pawan Kalyan : చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబు అరెస్టును పవన్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని అన్నారు పవన్ కల్యాణ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని..గతంలో జనసేన విషయం కూడా జగన్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు. విశాఖపట్నంలో జనసేన సమావేశాల సందర్భంగా ఇటువంటి తీరుగానే వ్యవహరించారని అన్నారు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు..? అంటూ ప్రశ్నించారు.
Nara Lokesh : నా తండ్రిని అరెస్ట్ చేస్తే నన్ను రెస్ట్ తీసుకోమంటారా..? అంటూ పోలీసులపై లోకేశ్ ఫైర్
కాగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో కేసులో రూ.550 కోట్ల కుంభకోణం జరగిందని దీనికి ప్రధాని సూత్రధారి చంద్రబాబే అంటే ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం 6 గంటల సంయంలో చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. చంద్రబాబు అరెస్టుతో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు, ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్