Home » CPI leader Narayana
ఏపీ, తెలంగాణ రాజకీయాల విషయంలో కమ్యూనిస్టు నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఏపీ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. పవన్, చంద్రబాబులు మునిగిన పడవలపై ఉన్నారని తెలిపారు. పవన్, చంద్రబాబులు రాజకీయ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
తమిళి సైని ఓట్లు వేసి ఎన్నుకోలేదన్నారు. రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఓటు వేసి ఎన్నుకున్నారని తెలిపారు.
కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ప్రధాని మోదీ, ఆర్ ఎస్ ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాలని చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐకి అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసినంత మాత్రాన ప్రజల నుంచి తమను రద్దు చేయలేరని పేర్కొన్నారు.