CPI Narayana : మోదీని కాపాడేందుకు కేసీఆర్ యత్నాలు.. అమిత్ షా వల్లే చంద్రబాబుకు బెయిల్ : నారాయణ

ఏపీ, తెలంగాణ రాజకీయాల విషయంలో కమ్యూనిస్టు నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana : మోదీని కాపాడేందుకు కేసీఆర్ యత్నాలు.. అమిత్ షా వల్లే చంద్రబాబుకు బెయిల్ : నారాయణ

cpi narayana

cpi leader narayana : సంచలన వ్యాఖ్యలు చేసే కమ్యూనిస్టు నేత నారాయణ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ రాజకీయాల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని కాపాడేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని.. అలాగే కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా వల్లే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలని అమిత్ షా చంద్రబాబును కోరారని, దానికి బాబు అంగీకరించకపోవటంతో అరెస్టు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధాని, బీజేపీ అగ్రనేత వాజ్‌పేయికి, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

తెలంగాణలో పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ తాము ఆశించిన సీట్లు ఇవ్వలేదని అయినా రాజకీయ లక్ష్యం కోసం ఒక్క సీటు కేటాయించినా అంగీకరించామని తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ లను ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. వివేక్ బీజేపీకి మ్యాన్ ఫేస్టో ఛైర్మన్ కానీ ఆయన కాంగ్రెస్ లో చేరగానే సీబీఐతో దాడులు చేయించారని ఆరోపించారు.

Also Read : అగ్రనేతల రోడ్ షోలకు అడ్డా కూలీలు…ఒక్కొక్కరికి కూలీగా రూ.500 చెల్లింపు

అందరికీ స‌న్‌స్ట్రోక్ ఉంటే.. కేసీఆర్ కి మాత్రం డాట‌ర్‌స్ట్రోక్‌ ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో అనేక ప్రాజెక్ట్ లు ఉన్నాయి గేట్లు కొట్టకపోయిన వాటిని చూశాం.. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 50 శాతం కమీషన్ తీసుకున్నారని ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. అలాగే రాష్ట్రమంతా ప్రచారం చేసే కేసీఆర్ యూనివర్సిటీల్లో కూడా ఎన్నికల ప్రచారం చేయాలి అంటూ ఛాలెంజ్ చేశారు. అభివృద్ధి పనుల్లో కేటీఆర్ కు వాటా లేకుండా పనిచేయరని ఆరోపించారు. అలాగే థర్డ్ ఫ్రంట్ తో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కాపాడాలని చూస్తున్నారని.. ఓటమి అంచుల్లో ఉన్న బీజేపీ కోసం తాపత్రయపడుతున్నారని ఆరోపించారు.

Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి గద్వాల్ జిల్లా సీనియర్ నేత

కష్టాలను ఎదిరించి పోరాడుతున్న బర్రెలక్కను అభినందిస్తున్నానన్నారు. ఆత్మహత్య చేసుకున్న శీరీష గురించి కేటీఆర్ తప్పుగా మాట్లాడారంటూ మండిపడ్డారు. కేటిఆర్ కి కూడా కూతురు ఉంది  అలా మాట్లాడవచ్చా..? అంటూ ప్రశ్నించారు. పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ గంజాయి మొక్కలాంటివాడు అంటూ విమర్శించారు. పువ్వాడ అజయ్ కు తమ పార్టీ నేతలు ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా గానీ సహకరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.