Telangana Assembly Election 2023 : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి గద్వాల్ జిల్లా సీనియర్ నేత

BRS sitting MLA joins Congress: గద్వాల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తూటికి చేరనున్నారు.

Telangana Assembly Election 2023 : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి గద్వాల్ జిల్లా సీనియర్ నేత

Revanth Reddy

తెలంగాణలో ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రచార పర్వానికి మరో నాలుగు రోజులే ఉండటంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. మరోవైపు పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా గద్వాల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తూటికి చేరనున్నారు.

Also Read : Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. మోదీ, అమిత్ షా సహా తెలంగాణలో అగ్రనేతల పర్యటనలు.. షెడ్యూల్ ఇలా

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత అబ్రహం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలంపూర్ నుంచి తన అనుచరులతో కలిసి అబ్రహం హైదరాబాద్ బయలు దేరారు. గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో అబ్రహం, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగాఉన్న అబ్రహంకు సీఎం కేసీఆర్ తొలి జాబితాలో మరోసారి టికెట్ కేటాయించారు. అయితే, బీఫామ్ ఇచ్చే సమయానికి అబ్రహం ను తొలగిస్తూ విజేయునికి పార్టీ బీఫాంను అందజేశారు. అబ్రహంకు టికెట్ కేటాయించడంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. దీనికితోడు అబ్రహం ను మార్చాలని కొందరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడితేవడంతో అబ్రహం స్థానంలో విజేయుడికి పార్టీ అధిష్టానం బీఫాం అందజేసింది.

Also Read : Today Headlines : ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేసీఆర్.. హైదరాబాద్ లో భారీగా పట్టుబడిన నగదు

తొలుత టికెట్ కేటాయించి మళ్లీ తప్పించడంతో అబ్రహం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల నుంచి ఆహ్వానాలు అందాయి. దీనికితోడు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి నుంచి హామీ వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన, ఆయన అనుచురులు చేరనున్నారు.