CPI Narayana : గవర్నర్ తమిళిసైపై సీపీఐ నేత నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళి సైని ఓట్లు వేసి ఎన్నుకోలేదన్నారు. రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఓటు వేసి ఎన్నుకున్నారని తెలిపారు.

NARAYANA
Narayana comments Governor : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో 250 డిస్కో పబ్ లకు అనుమతులు ఇచ్చి గవర్నర్ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. పుదుచ్చేరిలో మహిళలకు న్యాయం చేసేందుకు ఒక పబ్ ప్రత్యేకంగా మహిళలకు ఇచ్చారని పేర్కొన్నారు. పుదుచ్చేరిలో ప్రతి 10 ఇళ్లకు ఒక పబ్ ఇచ్చారని వెల్లడించారు.
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి పబ్ కు చిల్లర వసూలు చేశారని పేర్కొన్నారు. గవర్నర్ చేయి చాలా విశాలమైనదని చెప్పారు. మహిళా గవర్నర్.. మహిళకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడరని విమర్శించారు. కేసీఆర్ సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ని పిలవలేదంటున్న తమిళి సై రాష్ట్రపతిని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవకపోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
తమిళి సైని ఓట్లు వేసి ఎన్నుకోలేదన్నారు. రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఓటు వేసి ఎన్నుకున్నారని తెలిపారు. కేంద్రం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందన్నారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు దూరం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును కాదని ఆర్డినెన్స్ తెచ్చిందని వెల్లడించారు. మళ్ళీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగం ఉండదన్నారు. మోదీని వ్యతిరేకించే వారంతా ఒక్కటివ్వాలని విజ్ఞపి చేశారు.