Revanth Reddy: కాంగ్రెస్‌లో చేరిన మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు.. భారీగా చేరికలపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

దోపిడీదారులను పొలిమేరలు దాటేవరకు తరమాలని పిలుపునిచ్చారు.

Revanth Reddy: కాంగ్రెస్‌లో చేరిన మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు.. భారీగా చేరికలపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

Revanth Reddy

Updated On : June 16, 2023 / 3:09 PM IST

Revanth Reddy – Congress: హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో పలువురు నేతలు చేరారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool district)లోని అచ్చంపేట (Achampet) నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేత రాజేందర్, మాజీ జెడ్పీటీసీ భీముడు నాయక్, అచ్చంపేట, చారగొండ మండలాల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తమ పార్టీలో చేరికలు గాలివాటం చేరికలు కాదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దోపీడీకి 4 కోట్ల మంది ప్రజలు బలి అయ్యారని చెప్పారు. అప్పట్లో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ఇప్పుడు బొందలగడ్డగా మార్చారని అన్నారు. ఈ పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదని చెప్పారు.

కేసీఆర్ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించెందుకే ఈ చేరికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే చేరుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల చైతన్యానికి ప్రతీకగా ఈ చేరికలని తెలిపారు. కేసీఆర్ పాలన ఉండబోదని చెప్పారు.

వారు బిల్లా, రంగా..

రాష్ట్రంలో దారిదోపిడీ దొంగలు బిల్లా, రంగాలు హరీశ్, కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. దోపిడీదారులను పొలిమేరలు దాటేవరకు తరమాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని అన్నారు. ఆ నాడు పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు.

Puvvada Ajay kumar : ఆ రోజు రాజకీయాలనుంచి తప్పుకుంటా : మంత్రి పువ్వాడ