Narayana : ఇండియా కనపడితే మోదీ భయపడి భారత్ గా మారుస్తున్నారు : నారాయణ

వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

Narayana : ఇండియా కనపడితే మోదీ భయపడి భారత్ గా మారుస్తున్నారు : నారాయణ

CPI leader Narayana (1)

Updated On : September 10, 2023 / 1:33 PM IST

Narayana – Modi : బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. ఇండియా కనపడితే మోదీ భయపడి భారత్ గా మారుస్తున్నారని పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీజేపీ మణిపూర్ లో ఆల్లర్లు సృష్టింస్తుందని ఆరోపించారు. గ్యాస్ ధర 200 తగ్గించటం కాదు.. పూర్తి స్థాయిలో తగ్గించాలన్నారు. వామపక్షాలు సహా ప్రతి పక్షాలు అన్ని కలిసి ఇండియా కూటమి ఏర్పడిందని బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు. ఏజెండా లేకుండా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

ఈ మేరకు నారాయణ ఆదివారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. వన్ నేషన్ …వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు…పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కూతురు కవితను కాపాడుకోవటం కోసం కేసీఆర్, మోదీ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.

Praveen Kumar Reddy : మా నాయకున్ని అరెస్ట్ చేయడం బాధిస్తోంది.. నిన్ను కూడా జైలుకు పంపిస్తాం : ప్రవీణ్ కుమార్ రెడ్డి

విభజన చట్టంలో ఉన్న వాటిని బీజేపీ నేతలు సాధించారా అని ప్రశ్నించారు. రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వనన్న బీజేపీతో కేసీఆర్ ఎందుకు సఖ్యతగా ఉండాలని నిలదీశారు. అమరావతికి దిక్కు లేకుండా పోయిందన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పత్తా లేదని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే బీజేపీతో జగన్ మోహన్ రెడ్డి దోస్తీ చేస్తున్నారని విమర్శించారు.

చంద్ర బాబు నాయుడు జాతీయ స్థాయి నాయకుడు… ఆయన్ను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. చార్జీ షీట్ లేదు, గవర్నర్ అనుమతి లేదన్నారు. సీఐడీ ముసుగులో డేకాయిట్ లు తీసుకుని పోయారా అన్నట్లు ఉందన్నారు. వైసీపీ పతనం ప్రారంభం అయిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అమిత్ షాకి తెలియకుండా జరగదన్నారు.

Ramakrishna : కేంద్రం సహకారంతోనే చంద్రబాబు అరెస్ట్.. లండన్ నుంచే జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు : రామకృష్ణ

అరెస్టు వెనక ఎవరు ఉన్నారో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ తో సీపీఐకి ఒప్పందాలపై చర్చలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. అయితే సీట్లపై క్లారిటి రాలేదన్నారు. ఖమ్మం జిల్లా సీట్లతో పాటు రాష్ట్రంలో పలు సీట్లపై చర్చ సాగుతుందని పేర్కొన్నారు.