Home » Delta Variant
డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కరోనా కేసు రాజస్థాన్లోనూ నమోదైంది. మే నెలలో కరోనా నుంచి కోలుకున్న 65ఏళ్ల వయస్సున్న ఏండ్ల మహిళకు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది.
కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషిల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ (డిజి) డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
డెల్టా వేరియంట్ లో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరం, దగ్గు, వాసన లేకపోవడం. మే 21 నుంచి కనిపించిన లక్షణాలు మాత్రం.. తలనొప్పి, గొంతు మూసుకుపోవడం, ముక్కు కారడం వంటివి కూడా కనిపించాయి.
డేంజరస్ డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. యూకేలో ఈ వేరియంట్.. ఇతర వేరియంట్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. యూకే వేరియంట్ కెంట్ (Alpha-Kent) ను కూడా అధిగమించేసింది.
యూరప్ లో ఇటీవల వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని కేంద్రం తెలిపింది.