Delta Plus Variant: వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్నాక.. డెల్టా ప్లస్ పాజిటివ్
డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కరోనా కేసు రాజస్థాన్‌లోనూ నమోదైంది. మే నెలలో కరోనా నుంచి కోలుకున్న 65ఏళ్ల వయస్సున్న ఏండ్ల మహిళకు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌లు తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది.

Rajasthan Woman Test Positive For Delta plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కరోనా కేసు రాజస్థాన్‌లోనూ నమోదైంది. మే నెలలో కరోనా నుంచి కోలుకున్న 65ఏళ్ల వయస్సున్న ఏండ్ల మహిళకు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌లు తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది. నిర్ధారణ కోసం మరోసారి పరీక్షలు చేయించుకోగా డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చినట్లు బయటపడింది. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.
దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ నమోదైన రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ కూడా చేరిపోయింది. సదరు మహిళ శాంపిల్స్‌ను మే 31న ఒకసారి, ఆ తర్వాత 25 రోజులకు మరోసారి పరీక్షల నిమిత్తం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. డెల్టా ప్లస్ వేరియంట్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలడంతో ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది.
ఆమెతో కాంటాక్ట్ అయిన వారందరినీ ట్రేస్ చేయాలని బికనీర్ సీఎంహెచ్‌వో ఓపీ చాహర్ స్థానిక ఆరోగ్య సిబ్బందికి సూచించారు. నెల రోజుల వ్యవధిలో ఆ ఏరియాలో కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న అందరికీ మరోసారి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. స్థానికంగా వెలుగుచూసిన కేసులు రాష్ట్రమంతటా వ్యాపించకుండా చర్యలు ముమ్మరం చేయాలని సీఎం అశోక్ గెహ్లాట్ ఆదేశించారు.