Home » Heavy Rainfall
కూనవరం, వీఆర్ పురం పునరావాస కేంద్రాలను అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మిశ్రా సందర్శించారు.
భీకర వర్షాలు, పోటెత్తిన వరదలు..
ఆదివారం బెంగళూరులో కురిసిన భారీ వర్షం భీభత్సాన్ని సృష్టించింది. అండర్ పాస్‌లో చిక్కుకున్న 5 గురిని రక్షించడానికి ఓ స్త్రీ సాహసం చేసింది. తను తీసి ఇచ్చిన చీర సాయంతో వారి ప్రాణాలు కాపాడగలిగారు. ఆ మహిళ తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.
ఎడారి దేశం సౌదీ అరేబియా వరదలతో అతలాకుతలమవుతోంది. సౌదీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో జెడ్డా నగరం జలసముంద్రంలా మారిపోయింది. రోడ్లు చిన్నస్థాయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరదల తీవ్రతకు కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జలశయాలు నిండుకుండల్లా మారాయి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
ఇప్పటికే గత సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో సెలవులు ముగుస్తాయి. అయితే, రాష్ట్రంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు.
ఛత్తీస్‌ఘడ్, విదర్భ, మధ్య ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం, తెలంగాణ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది.
తోటలు నీట ముగనడం, తోటలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కూరగాయలు సేకరించడం కష్టమవుతోంది. అలాగే వానలు, వరదల కారణంగా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ కారణంగా కూరగాయలు సేకరించి, మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదు.
రానున్న రెండు రోజుల్లో కేరళ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఏప్రిల్ 14 వరకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.