Telangana Schools: విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగించిన తెలంగాణ
ఇప్పటికే గత సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో సెలవులు ముగుస్తాయి. అయితే, రాష్ట్రంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు.

Telangana Schools
Telangana Schools: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో సెలవులు ముగుస్తాయి. అయితే, రాష్ట్రంలో ఇంకా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు నీటి మునిగాయి.
Covid-19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 5 వేల బహుమతి.. కేంద్రం స్పష్టత
మరో నాలుగైదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి శనివారం (ఈ నెల 14-16) వరకు సెలవులు పొడిగిస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 18, సోమవారం నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి.