Covid-19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 5 వేల బహుమతి.. కేంద్రం స్పష్టత

వాట్సాప్‌లో ఫేక్ ప్రచారాలకు కొదువలేదు. ఈ ప్రచారం కూడా అలాంటిదే. తాజాగా వాట్సాప్‌లో.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి సంక్షేమ పథకం కింద రూ.5 వేలు బహుమతిగా అందిస్తున్నారు అంటూ హిందీలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది.

Covid-19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 5 వేల బహుమతి.. కేంద్రం స్పష్టత

Covid 19 Vaccine

Covid-19 Vaccine: ‘‘కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా.. అయితే మీకు కేంద్రం రూ.5 వేలు బహుమతిగా అందిస్తోంది. ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలు ఎంటర్ చేయండి’’ అంటూ కొద్ది రోజులుగా వాట్సాప్‍‌లో ఒక ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది.

Oppo: మరో చైనా కంపెనీ మోసం.. నాలుగు వేల కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టిన ఒప్పో

వాట్సాప్‌లో ఫేక్ ప్రచారాలకు కొదువలేదు. ఈ ప్రచారం కూడా అలాంటిదే. తాజాగా వాట్సాప్‌లో.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి సంక్షేమ పథకం కింద రూ.5 వేలు బహుమతిగా అందిస్తున్నారు అంటూ హిందీలో ఒక మెసేజ్ షేర్ అవుతోంది. దీనితోపాటు ఒక లింక్ కూడా అందులో ఉంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి డీటైల్స్ ఎంటర్ చేస్తే రూ.5 వేలు అందుతాయని, ఈ నెల 31 వరకే ఈ పథకం ఉంటుందని ఆ మెసేజ్ సారాంశం. ఇది నిజమని నమ్మి చాలా మంది లింక్‌పై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం

‘ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ)’ ద్వారా దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ మెసేజ్ నమ్మవద్దని, దీన్ని ఎవరికైనా ఫార్వార్డ్ చేయడంగాని లేదంటే ఆ లింక్‌పై క్లిక్ చేయడంగానీ చేయొద్దని సూచించింది. ఈ లింక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ డివైజ్‌లోకి మాల్‌వేర్ చొరబడుతుందని, మీ సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్తుందని కేంద్రం హెచ్చరించింది.