Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం

ఈ నెల 14 లోపు ఎన్నికల సామగ్రి అన్నిచోట్లకు చేరుకుంటుంది. ఈ ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, నిర్వహణ, భద్రతకు సంబంధించి కచ్చితమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట పంపుతారు.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం

Presidential Elections

Presidential Elections: ఈ నెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్దం చేస్తోంది భారత ఎన్నికల సంఘం (ఈసీఐ). ఈ ఎన్నికల నిర్వహణకు అసవరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్స్, స్పెషల్ పెన్స్, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్‌తోపాటు, ఢిల్లీ, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సామగ్రిని తరలిస్తోంది.

Cold Tea: సీఎంకు చల్లటి టీ ఇచ్చిన అధికారులు.. నోటీసులు జారీ

ఈ నెల 14 లోపు ఎన్నికల సామగ్రి అన్నిచోట్లకు చేరుకుంటుంది. ఈ ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వ, నిర్వహణ, భద్రతకు సంబంధించి కచ్చితమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట పంపుతారు. విమానాల్లో ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో ఎయిర్ టికెట్ బుక్ చేస్తారు. విమానం ఫ్రంట్ రో (మొదటి వరుస సీట్లు)లో ఈ సీటు బుక్ చేస్తారు. పక్కనే వీటిని తీసుకెళ్లే ఒక ప్రత్యేక అధికారి కోసం సీటు బుక్ చేస్తారు. ఈ బాక్సులను ఎన్నికలు నిర్వహించే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ (ఏఆర్ఓ)కు అందజేస్తారు.

Hijab Row: హిజాబ్ వివాదంపై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ

ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. 21న ఓట్లు లెక్కించి తీర్పు వెలువరిస్తారు. ఈ పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రాష్ట్రపతి ఈ నెల 25న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.