Cold Tea: సీఎంకు చల్లటి టీ ఇచ్చిన అధికారులు.. నోటీసులు జారీ

ముఖ్యమంత్రి తాగని టీకి.. చల్లగా ఉందని, నాణ్యత లేదని నోటీసులు జారీ చేయడం విశేషం. జిల్లా సప్లై ఆఫీసర్ రాకేష్ కన్హాకు, జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి.

Cold Tea: సీఎంకు చల్లటి టీ ఇచ్చిన అధికారులు.. నోటీసులు జారీ

Cold Tea

Cold Tea: ఎయిర్‌పోర్టులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి అక్కడి సిబ్బంది చల్లగా ఉన్న టీ అందించారు. దీనిపై సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. గత సోమవారం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖజురహో ఎయిర్‌పోర్టులో బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగారు. వీఐపీ లాంజ్‌లో ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేసిన అనంతరం ఆయనకు టీ అందించారు.

SriLanka: మాల్దీవ్స్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

అయితే, సమయం తక్కువగా ఉండటంతో ఆయన టీ తాగకుండానే వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి తాగని టీకి.. చల్లగా ఉందని, నాణ్యత లేదని నోటీసులు జారీ చేయడం విశేషం. జిల్లా సప్లై ఆఫీసర్ రాకేష్ కన్హాకు, జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి. ‘ముఖ్యమంత్రికి టీ, బ్రేక్‌ఫాస్ట్ అందించే బాధ్యత మీది. అయితే నాణ్యమైన టీ అందించలేదు. చల్లారిన, నాణ్యతలేని టీని అందించారు. ఇది వీఐపీ ప్రొటోకాల్‌కు విరుద్ధం. దీనిపై మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. లేకుంటే ఏకపక్షంగా మీపై చర్యలు తీసుకుంటాం’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ నోటీసుల అంశం సోషల్ మీడియా ద్వారా వైరల్‌గా మారింది. చాలా మంది ఈ నోటీసుల్ని తప్పుబట్టారు.

Tea Production: వర్షాల ప్రభావం.. తగ్గనున్న తేయాకు ఉత్పత్తి

ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కలెక్టర్ ఈ నోటీసుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై తీవ్ర విమర్శలు చేసింది. ‘‘ప్రజలకు రేషన్, అంబులెన్స్ వంటి సర్వీసులే అందడం లేదు. ముఖ్యమంత్రికి చల్లటి ఇవ్వడమే తప్పా’’ అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది.