Hijab Row: హిజాబ్ వివాదంపై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ

హిజాబ్ వివాదానికి సంబంధించి గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు హిజాబ్ దరించి రావడంపై ఒక కళాశాల నిషేధం విధించింది.

Hijab Row: హిజాబ్ వివాదంపై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ

Hijab Row

Hijab Row: హిజాబ్ అంశంపై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హిజాబ్ వివాదానికి సంబంధించి గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. గత మార్చిలోనే ఈ పిటిషన్ దాఖలైనప్పటికీ, విచారణపై కోర్టు స్పందించలేదు. తాజాగా దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అంగీకరించారు.

Cold Tea: సీఎంకు చల్లటి టీ ఇచ్చిన అధికారులు.. నోటీసులు జారీ

సుప్రీం బెంచ్ దీనిపై వచ్చే వారం విచారణ జరుపుతుందని ఆయన ప్రకటించారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థులు హిజాబ్ దరించి రావడంపై ఒక కళాశాల నిషేధం విధించింది. దీంతో ముస్లిం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. తమను హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చేందుకు అనుమతించాలని కోరారు. ఇది క్రమంగా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివాదం తలెత్తింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. చివరకు ఈ అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది.

JP Nadda: బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ: జేపీ నద్దా

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. విద్యాసంస్థల్లో యూనిఫామ్ ధరించాలని సూచించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాజాగా దీనిపై వచ్చే వారం విచారణ జరగనుంది.