Home » Maharashtra
ఇటీవల శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల రీత్యా షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వీటన్నింటినీ సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టు�
ఇందులో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు, మంత్రిగా కొనసాగిన ఆదిత్య థాక్రేను మినహాయించారు. స్పీకర్ ఎన్నికతోపాటు, అవిశ్వాస పరీక్షలో పార్టీ జారీ చేసిన విప్‌లను ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేశారు.
ముంబై పోలీస్ కమిషనర్‌తో భేటీ అయిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని..సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు’ అని ఆదేశించారు.
పార్టీ గుర్తు విషయంలో చర్చ జరుగుతోంది. చట్ట ప్రకారం పార్టీ గుర్తును ఎవరూ తీసుకెళ్లలేరు. అది శివసేనతోనే ఉంటుంది. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదు. న్యాయ నిపుణులను కలిసిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను అని వివరించారు.
తను ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం మూడు చక్రాల బండి అని, అయితే దీన్ని ఇప్పుడు షిండే తీసుకుని నడుపుతున్నాడని ఉద్ధవ్ వ్యాఖ్యానించాడు. పరోక్షంగా షిండే ఒక ఆటో డ్రైవర్ అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు.
మధ్యంతర ఎన్నికలు వస్తే ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ వంద సీట్లు గెలుస్తుంది. ప్రజలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. మా పార్టీపై నమ్మకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్లు క�
సీఎంగా అధికారం చేపట్టాక ఏక్ నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు షిండే. ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని..దీంట్లో భాగంగానే ఇంధనంపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చ
శివసేన పార్టీని అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. మేం మీకు భయపడం. మీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రండి. అక్కడ తేల్చుకుందాం. మీ దమ్మెంతో.. మా దమ్మెంతో తేలుతుంది.. అంటూ బీజేపీ అధిష్టానానికి శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠా�
బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఎంతోకాలం అధికారంలో ఉండరు..ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది ..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం’’ అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ సాల్వే, అధికార బీజేపీ-శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున పోటీ చేశారు. ఆయనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు, మరో ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. దీంతో సులభంగా విజయం సాధించారు.