Hijab Row: నీట్ విద్యార్థుల బుర్ఖా తీయించిన కళాశాల యాజమాన్యం

దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని 3వేల 570 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ రాసేందుకు 18లక్షల 72వేల 329 మంది రిజిష్టర్ చేసుకోగా 95శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పలు చోట్ల నీట్ విద్యార్థులకు అవరోధాలు ఏర్పడ్డాయి.

Hijab Row: నీట్ విద్యార్థుల బుర్ఖా తీయించిన కళాశాల యాజమాన్యం

Hijab Row

Updated On : July 18, 2022 / 11:21 PM IST

 

 

Hijab Row: దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని 3వేల 570 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ రాసేందుకు 18లక్షల 72వేల 329 మంది రిజిష్టర్ చేసుకోగా 95శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పలు చోట్ల నీట్ విద్యార్థులకు అవరోధాలు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని వశీం జిల్లాలో బుర్ఖా తీయించి అభ్యర్థులను పరీక్ష రాయించారు. ఇద్దరు విద్యార్థులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

వశీం జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. ఇద్దరు మహిళ విద్యార్థులను బుర్ఖా తీసి ముఖం కనిపించేలా పరీక్ష కేంద్రానికి రావాలంటూ మాతోశ్రీ శాంతాబాయి గోటె కాలేజీ ఆదేశించింది. స్వతహాగా బుర్ఖా తీయకపోతే దానిని కట్ చేస్తామంటూ స్టాఫ్ బెదిరించారని పోలీసులకు కంప్లైంట్ చేశారు విద్యార్థులు.

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. 100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు (బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమీ లేక విద్యార్థినులు తాము ధరించిన లోదుస్తులు తొలగించారు.

Read Also ‘నీట్-యూజీని వాయిదా వేయాలి’.. పిటిష‌న్ వేసిన‌ అభ్య‌ర్థులు

కేరళ కొల్లంలోని మార్తోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘోరం జరిగింది. లోదుస్తులు విప్పించడాన్ని విద్యార్థినులు ఎంతో అవమానంగా ఫీలయ్యారు. సిబ్బంది తీరుతో పరీక్షకు ముందు తాము తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని, మానసిక క్షోభను అనుభవించామని వాపోయారు.