Home » Matti Manishi
ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో గింజ పాటు పోసుకునే దశలో ఉంది. అయితే ఆగస్టు , సెప్టెంబర్ లలో కురిసిన వర్షాలుకు చాలా చోట్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనినే మాణికాయ, కాటుక తెగులు అనికూడా అంటారు.
సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది. మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం.
మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.
వేరుశనగలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి, పంట విత్తిన 48 గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లైతే మున్ముందు సమస్యలు తలెత్తవు.
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.
పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి రెండు జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు రిస్కు తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున, ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసేవీలు ఏర్పడింది.
తొలకరిలో వేసిన స్వల్పకాలిక పంటలైన వరి, పెసర, మినుము పూర్తయిన చోట్ల, రెండవ పంటగా కందిని సాగుచేయవచ్చు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా వుంటాయి. తొలకరిలో వేసిన కంది ఎక్కువ ఎత్తు పెరగటం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా వుంటుంది.
ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర రూ. 10 వేలు పలికింది. రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు.
క్యాబేజి, కాలీఫ్లవర్ సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ముందుగా ప్రధానపొలాన్ని దమ్ముచేసేటప్పుడే పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువులను కలిపి దుక్కిలో చల్లుకోవాలి. వీటి తరువాత నత్రజని, భాస్వరం,పొటాష్ ఎరువులను వేసి కలియదున్నాలి.
శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు.