Pig Farming : విదేశీ పందుల పెంపకంతో.. అధిక లాభాలు

సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది.  మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం.

Pig Farming : విదేశీ పందుల పెంపకంతో.. అధిక లాభాలు

Pig Farming :

Updated On : October 13, 2023 / 12:44 PM IST

Pig Farming : వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలతో మంచి ఆదాయం పొందవచ్చు. వ్యవసాయంలో ఒక్కోసారి పంటలు పండక పోవడం.. పంట దిగుబడి వచ్చినా.. మార్కెట్ లో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. అయితే, చిన్న, సన్నకారు రైతులతో పాటు నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తూ.. అండగా నిలుస్తోంది విదేశీ పందుల పెంపకం. వీటి పెంపకంతో రైతులు, నిరుద్యోగులు జీవనోపాధి పొందడంతో పాటు ఆర్థికంగా ఎదగవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు . అయితే ఈ విదేశీ పందులను ఎలా పెంచాలి? లాభసాటిగా పందుల పెంపకం ఉండాలంటే ఏం చేయాలో వివరాలను గన్నవరం పశువైద్య కళాశాల లైవ్ స్టాక్ ఫాం హెడ్ వెంకటశేషయ్య ద్వారా తెలుసుకుందాం..

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా  పౌష్టికాహార భద్రత సాధించడానికి పశుపోషణ దోహదపడుతోంది. కోళ్లు, మేకల తరహాలో పందుల పెంపకం ఎంతోమందికి ఉపాధినిస్తున్న పరిశ్రమ. తక్కువ కాలంలో కనీసపు పెట్టుబడితో మంచి లాభాలను అందించే వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా సీమపందుల పెంపకం పేరుగాంచింది. విదేశీ జాతులైన లార్జ్ వైట్‌యార్క్‌షైర్‌, లాంగ్‌రేస్‌ , బెర్క్ షేర్ వంటి రకాలతో పాటు సంకరజాతి పందులు కూడా మన వాతావరణానికి అనుకూలం. ఇవి వివిధ ధాన్యాలు, ఆహార వ్యర్థాలను  తీసుకుని  పెరుగుతాయి. ఎక్కువ పిల్లలను పెట్టటం వల్ల సంతాన వృద్ధి వేగంగా వుంటుంది. ఎంత వేగంగా అంటే 10 ఆడ సీమపందులు 2 మగ పందులతో పెంపకం ప్రారంభిస్తే వీటి సంఖ్య ఏడాదికి 150 దాటుతుంది.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది.  మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం. వీటి కొవ్వును కోళ్ల దాణా, సబ్బుల తయారీ, రంగులు, రసాయనాల్లో వినియోగిస్తున్నారు. 7-8 నెలలకే  వీటిని మార్కెట్ చేయవచ్చు.  చక్కటి ఉపాధినిచ్చే రంగంగా సీమపందుల పెంపకం వుందంటూ, పెంపకంలో పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారూ కృష్ణా జిల్లా, గన్నవరం పశువైద్య కళాశాల లైవ్ స్టాక్ ఫాం హెడ్ వెంకటశేషయ్య .

READ ALSO : Harvesting Chillies : మిరపలో కోతకు ముందు, కోత తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

వ్యాపారసరళిలో సీమ పందుల పెంపకాన్ని చేపట్టే రైతాంగం ముందుగా వీటి మౌలిక సదుపాయల పట్ల దృష్ఠి సారించాలి. గాలి, వెలుతురు బాగా వున్న చోట షెడ్లు నిర్మించాలి. వాటి ద్వారా వ్యాపించే రోగ కారక సూక్ష్మక్రిములను అరికట్టాలి. 5 ఆడపందులు ఒక మగ పందితో వీటి పెంపకం చేపట్టాలి. ఒక్కో పంది  సంవత్సరానికి రెండు సార్లు పిల్లను పెడుతుంది. అంటే 16 నుండి 20  పిల్లను పొందవచ్చు.  పుట్టిన పిల్లలు చనిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సరైన సమయంలో టీకాలు, మందులు వేయాలి.

సీమపందుల పెంపకం ఖర్చులో ఎక్కువభాగం వాటి మేపుకే అవుతుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టి, దాణా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. పూర్తిగా దాణాపై ఆధారపడితే పెంపకం లాభసాటిగా వుండదు. మేపును బట్టి ఒక్కో సీమపంది రోజుకు 400-500గ్రాములు పెరుగుతుంది.