Black Gram Cultivation : రబీకి అనువైన మినుము రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.

Black Gram Cultivation : రబీకి అనువైన మినుము రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Black Gram Cultivation

Updated On : October 12, 2023 / 2:30 PM IST

Black Gram Cultivation : తక్కువ సమయం, తక్కువ నీటితో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పుజాతి పంట  మినుము. మూడు కాలాల్లో సాగుచేసుకోవచ్చు. అంతర పంటగా కూడా వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రబీ లో మినుమును అక్టోబర్ వరకు వేసుకోవచ్చు.  అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపికచేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంటుంది. మినుములో రబీ కి అనువైన రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. జగన్ మోహన్ రావు .

READ ALSO : Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో మినుమును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.  ఈ పంటను మూడు కాలల్లో సాగుచేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 12.5 లక్షల ఎకరాల్లోను, తెలంగాణలో 3లక్షల 75 వేల ఎకరాల్లో సాగవుతుంది. ప్రస్తుత రబీ లో నీటివసతి కింద, అక్టోబర్  వరకు మినుము విత్తేందుకు అనువైన సమయం. కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ వరి కోసిన మాగాణి పొలాల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. అసలు రబీ మినుము రకాలు ఏంటి..? వాటి గుణగణాలు, దిగుబడి ఏవిధంగా వుంటుందో వివరిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. జగన్ మోహన్ రావు .

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

రెండు మూడు నీటి తడులను ఇచ్చే పరిస్థితి ఉన్న ప్రాంతాలలో మినుమును సాగుచేయాలి. కాలం మించిపోకుండా సరైన సమయంలో విత్తుకుంటే చీడపీడల సమస్య తక్కువ వుండి,  అధిక దిగుబడి సాధించే వీలుంటుంది.