Papaya Cultivation : తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం

ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర రూ. 10 వేలు పలికింది.  రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు.

Papaya Cultivation : తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం

Papaya Cultivation

Updated On : October 9, 2023 / 11:46 AM IST

Papaya Cultivation : బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా.. తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది తెగుళ్ల బెడద లేకపోవడం.. మంచి ధరలులు పలుకుతుండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓరైతుకు ఈ పంట సిరులు కురిపిస్తోంది.

READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

వాణిజ్య పంటల సాగుతో అన్నదాత కు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలు వచ్చే పంటలపై దృష్టిపెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలు ఉంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, పొంగూరు గ్రామానికి చెందిన రైతు నాగరాజు రెడ్డి 8 ఏళ్లుగా బొప్పాయి పంట సాగు చేస్తూ.. లాభాలను గడిస్తున్నారు.

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

రైతు నాగరాజు బొప్పాయి తోటలో కలుపు రాకుండా మల్చింగ్‌ షీట్ల ఏర్పాటుచేసి , డ్రిప్‌ ఇరిగేషన్‌, తదితర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి.. మొత్తం 15 ఎకరాల్లో బొప్పాయి సాగుచేశారు. ఈ పంట నాటిన 5 నెలల్లోనే పూతకు వచ్చి ఆరో నెలలో కాయలు కాయడం మొదలవుతుంది. ఏడవ నెలనుండి కోత దిగుబడులు ప్రారంభమవుతుంటాయి. మొదటి కోత తరువాత 20 రోజులకు ఒకసారి కోత కోస్తుంటారు. ఇలా పంట పూర్తి అయ్యేసరికి 8 కోతలు వస్తాయి. ఈ ఏడాది తెగుళ్లు తగ్గడం.. పంట దిగుబడులు కూడా పెరిగాయి. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడిని పొందారు రైతు.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర రూ. 10 వేలు పలికింది.  రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు. పెట్టుబడి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున 15 లక్షలు పోగా ఈ ఏడాది రైతు నికర ఆదాయం 20 లక్షలు. కాబట్టి రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తే.. లాభాలను ఇలాగే పొందే అవకాశం ఉంటుంది.